ఎమ్మెల్సీ ఎన్నికలు శాంతియుతంగా నిర్వహించాలి
సాక్షి, అమలాపురం: ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల ఉపాధ్యాయ శాసనమండలి ఎన్నికలు శాంతియుత వాతావరణంలో నిర్వహించేందుకు జిల్లా యంత్రంగా సిద్ధంగా ఉందని, ఇందుకు రాజకీయ పార్టీల ప్రతినిధులు తమవంతు సహకారం అందించాలని కలెక్టర్ ఆర్.మహేష్‌కుమార్ కోరారు. స్థానిక కలెక్టరేట్‌లోని బుధవారం జిల్లా స్థాయి రాజకీయ పార్టీల ప్రతినిధులతో ఈ ఎన్నికల నిర్వహణపై సమీక్షించారు. ఈ ఎన్నికల నామినేషన్ల స్వీకరణకు 18వ తేదీ తుది గడువని, 19న పరిశీలన, 21వ తేదీ ఉపసంహరణలకు తుది గడువని తెలిపారు. డిసెంబర్ 5వ తేదీన పోలింగ్, 9న ఓట్ల లెక్కింపు, 12వ తేదీతో ఎన్నికల ప్రక్రియ ముగుస్తుందన్నారు. ఈ ఎన్నికలకు మండలానికి ఒక పోలింగ్ కేంద్రాన్ని ఏర్పాటు చేశామని కలెక్టర్ తెలిపారు. జిల్లా వ్యాప్తంగా 3,209 మంది ఓటర్లు ఉన్నారని, పోలింగ్ కేంద్రాల నిర్వహణలో రాజకీయ పార్టీల ప్రతినిధులకు ఏమైనా అభ్యంతరాలు ఉంటే చెప్పవచ్చని కలెక్టర్ తెలిపారు.
వసతి గృహ విద్యార్థులకు ఆరోగ్య బీమా
జిల్లాలో ఎస్సీ, బీసీ సంక్షేమ వసతి గృహాలు, అనాథ ఆశ్రమాల్లోని విద్యార్థులకు ఆరోగ్య బీమా కల్పనకు ఐసీఐసీఐ లాంబార్డు హెల్త్ ఇన్సూరెన్స్‌తో ఒప్పందం కుదిరిందని కలెక్టర్ మహేష్ కుమార్ తెలిపారు. జిల్లాలో ఉన్న సుమారు 7,650 మంది విద్యార్థినీ విద్యార్థులు ఇది మేలు చేస్తోందని తెలిపారు. కలెక్టరేట్‌లో బుధవారం బీసీ, ఎస్సీ సంక్షేమ శాఖ, జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారులు, చిన్నారుల వైద్య నిపుణులతో సమావేశం నిర్వహించి బీమా విధి విధానాలను వివరించారు. నెట్వర్క్ ఆస్పత్రులకు చేసిన మ్యాపింగ్ ఆధారంగా ఆయా ఆసుపత్రులకు చేరుకుని రూ.లక్ష వరకు వైద్య సేవలను పొందవచ్చని వివరించారు. జిల్లా మహిళా శిశు సంక్షేమ శాఖ అధికారి ఎం.ఝాన్సీరాణి, జిల్లా సాంఘిక సంక్షేమ శాఖ అధికారిని పి.జ్యోతిలక్ష్మి దేవి తదితర అధికారులు పాల్గొన్నారు.
జిల్లా కలెక్టర్ మహేష్‌కుమార్
రాజకీయ పార్టీల ప్రతినిధుల
సహకారం కోరుతూ సమావేశం
Comments
Please login to add a commentAdd a comment