చెత్త డంపింగ్‌లో ఉద్రిక్తత
అమలాపురం రూరల్: మండలం బండారులంకలోని డంప్ యార్డులో చెత్త వేసేందుకు వచ్చిన ట్రాక్టర్లను స్థానికులు అడ్డుకోవడం ఉద్రిక్తతలకు దారితీసింది. బుధవారం చెత్త వేసేందుకు వచ్చిన ట్రాక్టర్లను స్థానిక మహిళలు అడ్డుకుని తమ పైనుంచి వెళ్లాలని రోడ్డుపై బైఠాయించారు. వీరభద్రస్వామి గుడి వద్ద పంచాయతీ డంప్‌యార్డు వల్ల రోగాలు వస్తున్నాయని గత 40 రోజులుగా వారు ఈ విషయమై ఆందోళన చేస్తున్న విషయం తెలిసిందే. దీంతో గ్రామంలో చెత్త ఎక్కడికక్కడ పేరుకుపోయి ప్రజలు డెంగీ, చికున్ గున్యాలతో బాధపడుతున్నారు. దీంతో ప్రత్యామ్నాయం దొరికే వరకు ఆర్డీఓ కె.మాధవి ఆదేశాల మేరకు డంప్ యార్డుకే చెత్తను తరలించారని నిర్ణయించారు. డీఎల్‌పీఓ కె.బొజ్జిరాజు, తహసీల్దార్ కిశోర్‌బాబు, డీటీ పలివెల అశోక్, ఈఓపీఆర్డీ కె.మంగాదేవి, కార్యదర్శి శ్రీనివాస్‌తో పాటు సర్కిల్‌లో ఎస్సైలు శేఖర్‌బాబు, హరీష్‌కుమార్, రాజేష్‌తో పాటు 50 మంది పోలీసులు గ్రామంలో మోహరించి బందోబస్తీ మధ్య చెత్తను టాక్టర్లతో తరలించారు. దీంతో స్థానికులు ఆందోళన చేపట్టడంతో ఇరు వర్గాల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. టీడీపీ గ్రామ కమిటీ అధ్యక్షుడు పిచ్చిక శ్యామ్‌తో పాటు 40 మందిని పోలీసులు అరెస్టు చేసి పోలీసు స్టేషన్‌కు తరలించారు.
ట్రాక్టర్లను అడ్డుకున్న
బండారులంక గ్రామస్తులు
రోగాలు వస్తున్నాయని ఆందోళన
40 మందిని అరెస్టు చేసిన పోలీసులు
Comments
Please login to add a commentAdd a comment