ఫ్లెక్సీలను తొలగించిన అధికారులు
కె.గంగవరం: ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో కోడ్ అమలులో ఉన్నా మండల పరిధిలోని కోటిపల్లిలో రాజకీయ నాయకుల ఫ్లెక్సీలను తొలగించలేదు. దీనిపై ‘సాక్షి’లో ఈ నెల 23న కోడ్ను వెక్కిరిస్తున్న ఫ్లెక్సీలు అనే శీర్షికతో వార్త ప్రచురితమైంది. ఈ కథనానికి స్పందించిన మండల స్థాయి అధికారులు వెంటనే ఫ్లెక్సీలను తొలగించాలని గ్రామ స్థాయి అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. దీంతో పంచాయతీ కార్యదర్శి సుబ్బారావు, రెవెన్యూ సిబ్బంది గ్రామలో ఏర్పాటు చేసిన కొన్ని ఫ్లెక్సీలను తొలగించారు. మరికొన్నింటిని బరకాలతో కప్పేశారు.
Comments
Please login to add a commentAdd a comment