అంతర్వేదిలో భక్తుల రద్దీ
సఖినేటిపల్లి: కార్తిక మాసంలోని నాలుగో శనివారం సందర్భంగా అంతర్వేది లక్ష్మీనరసింహస్వామి ఆలయానికి భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. సాధారణ భక్తులతో పాటు అయ్యప్ప, భవాని, శివ మాలధారులు పోటెత్తారు. భక్తులకు ఎటువంటి ఇబ్బంది కలుగకుండా ఆలయ అసిస్టెంట్ కమిషనర్ వి.సత్యనారాయణ ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. క్యూలైన్లో ఉన్న వారందరికీ తాగునీటి సదుపాయం కల్పించారు. నిత్యం నిర్వహించే నారసింహ సుదర్శన హోమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. స్వామి దర్శనం అనంతరం నిత్యాన్నదాన పథకంలో అన్న ప్రసాదం స్వీకరించారు.
Comments
Please login to add a commentAdd a comment