ఎమ్మెల్సీ ఎన్నికల అధికారులకు శిక్షణ
అమలాపురం రూరల్: ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్‌ను శాంతియుత వాతావరణంలో నిర్వహించాలని జిల్లా రెవెన్యూ అధికారి వి.మదన మోహనరావు అన్నారు. కలెక్టరేట్‌లోని గోదావరి భవన్‌లో జిల్లాలో ఏర్పాటు చేసిన 22 పోలింగ్ కేంద్రాలకు నియమించిన ప్రిసైడింగ్, ఇతర అధికారులతో శనివారం మొదటి దఫా శిక్షణ నిర్వహించారు. డీఆర్వో మాట్లాడుతూ ఎన్నికల బరిలో ఐదుగురు అభ్య ర్థులు ఉన్నారని, డిసెంబర్ ఐదున పోలింగ్, 9వ తేదీన కాకినాడ జేఎన్టీయూలో ఓట్ల లెక్కింపు జరుగుతుందన్నారు. రిసోర్స్ పర్సన్, మండపేట తహసీల్దార్ తేజేశ్వరరావు మాట్లాడుతూ ప్రజాప్రాతినిధ్య చట్టం ప్రకారం టెండర్ ఓట్లు చాలెంజ్ ఓట్ల ప్రక్రియను స్పష్టతతో చేపట్టాలని సూచించారు. కార్యక్రమంలో డీఆర్‌డీఏ పీడీ డాక్టర్ వి.శివశంకర్ ప్రసాద్ పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment