మాదిగలకు తీవ్ర నష్టం
అమలాపురం టౌన్: జిల్లాను యూనిట్‌గా తీసుకోవడం వల్ల మాదిగలు తీవ్రంగా నష్టపోతున్నారని మాదిగ రిజర్వేషన్ పోరాట సంఘర్షణ సమితి (ఎమ్మార్పీఎస్ఎస్) జాతీయ అధ్యక్షుడు తెన్నేటి కిషోర్ ఆవేదన వ్యక్తం చేశారు. స్థానిక ప్రెస్ క్లబ్ భవనంలో శనివారం జరిగిన ఎమ్మార్పీఎస్ఎస్ ముఖ్య నాయకుల సమావేశంలో ఆయన మాట్లాడారు. జిల్లాను కాకుండా రాష్ట్రాన్ని యూనిట్‌గా తీసుకుని ఎస్సీ రిజర్వేషన్‌ను అమలు చేయాలని డిమాండ్ చేశారు. 1997 జస్టిస్ రామచంద్రరాజు కమిషన్ నివేదిక ఆధారంగా షెడ్యూలు కులాల వర్గీకరణ ఏ విధంగా అమలు చేస్తారో, అదే విధంగా రాష్ట్రాన్ని ఒక యూనిట్‌గా తీసుకుని ఏబీసీడీ వర్గీకరణ అమలు చేయాలని కూటమి ప్రభుత్వానికి సూచించారు. సమావేశంలో ఎమ్మార్పీఎస్ఎస్ జిల్లా అధ్యక్షుడు ఈతకోట రాజు, ఉపాధ్యక్షు డు కొడమంచిలి సాయికుమార్, రాష్ట్ర కార్యదర్శి కుందుర్తి సత్యనారాయణ పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment