ముగిసిన రాష్ట్ర స్థాయి టీటీ పోటీలు
నాగమల్లితోట జంక్షన్ (కాకినాడ సిటీ): జిల్లా టేబుల్ టెన్నిస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో కాకినాడ శ్రీప్రకాష్ సినర్జీ పాఠశాలలో మూడు రోజులుగా జరుగుతున్న రాష్ట్ర స్థాయి టేబుల్‌టెన్నిస్ పోటీలు ఆదివారంతో ముగిశాయి. తొలుత మ్యాచ్‌లను మాజీ రాజ్యసభ సభ్యుడు కేవీపీ రామచంద్రరావు, స్పోర్ట్స్ అఽథారటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ డైరెక్టర్ ఎస్‌వీ రమణ, ఓఎన్జీసీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ రత్నేష్ కుమార్‌లు అతిథులుగా విచ్చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా కేవీపీ రామచంద్రరావు మాట్లాడుతూ క్రీడలు మానవ మేధస్సును ఉత్తేజంచేసి, దేహాన్ని పటిష్టపరుస్తుందన్నారు. చదువులో కలిగే ఒత్తిడిని జయించేందుకు క్రీడలు దోహదపడతాయని తెలిపారు. శాప్ డిప్యూటీ డైరెక్టర్ ఎస్‌వీ రమణ మాట్లాడుతూ క్రీడలతో నాయకత్వ లక్షణాలు, పట్టుదల అలవడతాయన్నారు. అనంతరం విజేతలకు అతిథుల చేతుల మీదుగా మెమెంటోలు అందజేశారు. కార్యక్రమంలో శ్రీప్రకాష్ స్కూల్ డైరెక్టర్ సీహెచ్ విజయప్రకాష్, టేబుల్ టెన్నిస్ సంఘ గౌరవ అధ్యక్షుడు రావు చిన్నారావు, అధ్యక్షుడు భాస్కర్‌రామ్, కార్యదర్శి మోహన్‌బాబు, శ్రీప్రకాష్ స్కూల్ ప్రిన్సిపాల్ ఎంవీవీఎస్ మూర్తి, పెద్దాపురం, కాకినాడ శాఖల ప్రిన్సిపాల్స్ శ్రీదేవి, ప్రశాంతి తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment