పి.గన్నవరం: నెల రోజుల కిందట భర్త చనిపోవడంతో బెంగతో ఉన్న ఓ మహిళ ప్రమాదవశాత్తూ పంట కాలువలో పడి మృతి చెందింది. ఈ నెల 19న ఇంటి నుంచి అదృశ్యమైన ఆ మహిళ ఆదివారం మొండెపులంక లంక వద్ద పంట కాలువలో శవమై తేలింది. ఎస్సై బి.శివకృష్ణ కథనం ప్రకారం.. పి.గన్నవరం గ్రామానికి చెందిన దొంగ చిరంజీవి (54) భర్త ఆనందరావు నెల రోజుల క్రితం గుండెపోటుతో మరణించాడు. అప్పటి నుంచి ఆమె దిగులుతో ఉంటోంది. ఈ నెల 19న ఆమె ఇంటి నుంచి బయటకు వెళ్లింది. తిరిగి రాకపోవడంతో కుటుంబ సభ్యులు, బంధువులు పరిసర ప్రాంతాల్లో గాలించారు. మొండెపులంక వద్ద ప్రధాన పంట కాలువలో ఆదివారం ఆమె లభ్యమైంది. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం రాజోలు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్సై శివకృష్ణ వివరించారు.
Comments
Please login to add a commentAdd a comment