ఖాళీ బాటిల్.. చేపలు ఫుల్
యానాం: సాధారణంగా చేపలను వేటాడటానికి వల, గేలం ఉపయోగిస్తారు. ఇది అందరికి తెలిసిన విషయమే. అయితే కొందరు ఖాళీ వాటర్ బాటిల్‌ను ఉపయోగించి వినూత్నంగా చేపల వేట సాగిస్తున్నారు. వివరాల్లోకి వెళితే.. యానాం గౌతమీ గోదావరి తీరం ప్రాంతంలోని కనకాలపేట పుష్కరఘాట్ వద్ద పలువురు యువకులు చేపలు పట్టేందుకు ఈ టెక్నిక్ ఉపయోగిస్తున్నారు. ముందుగా ఖాళీ వాటర్ బాటిల్‌ను మధ్యగా కోసి రెండు భాగాలు చేస్తారు. వాటికి కింద, పైభాగాలలో రంధ్రాలు పెట్టి మధ్యలో రెండు సీసా మూతలు బయటపెడతారు. లోపలి భాగంలో మైదాపిండిని ఎరగా పెడతారు. అనంతరం ఆ బాటిల్‌కు తాడు కట్టి గోదావరిలో విసురుతున్నారు. బాటిల్‌లో మేత తినేందుకు వచ్చిన చేపలో దానిలో చిక్కుకుంటున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment