2025 సంవత్సరానికి కొబ్బరి కనీస మద్దతు ధరలను కేంద్రం పెంచింది. కమిషన్ ఫర్ అగ్రికల్చర్ కాస్ట్ అండ్ ప్రైస్ (సీఏసీపీ) సిఫారసు మేరకు కేంద్ర మిల్లింగ్ కోప్రా (ఎండు కొబ్బరి) క్వింటాల్‌కు రూ.422 చొప్పున, బాల్ కోప్రా (కొబ్బరి కురిడీ) క్వింటాల్‌కు రూ.100 చొప్పున పెంచింది. ప్రస్తుతం మిల్లింగ్ కోప్రా ధర క్వింటాల్ రూ.11,582 వరకు ఉండగా, తాజా పెంపుతో రూ.12 వేలు అయ్యింది. బాల్ కోప్రా ధర రూ.12 వేలు ఉండగా ఇప్పుడు పెంచిన ధరతో రూ12,100 వరకు పెరిగింది. బహిరంగ మార్కెట్‌లో కొబ్బరి ధరలు పతనమైన సమయంలో నేషనల్ అగ్రికల్చర్ కో ఆపరేటివ్ మార్కెటింగ్ ఫెడరేషన్ ఆప్ ఇండియా లిమిటెడ్ (నాఫెడ్), నేషనల్ కో ఆపరేటివ్ కన్జ్యూమర్స్ ఫెడరేషన్ (ఎన్‌సీసీఎఫ్)లు కేంద్రం తాజాగా ప్రకటించిన ఈ కనీస మద్దతు ధరలకు కొబ్బరి కొనుగోలు చేస్తాయి.
Comments
Please login to add a commentAdd a comment