రాష్ట్రస్థాయి విజ్ఞాన ప్రదర్శనలో కోనసీమ సత్తా
సాక్షి, అమలాపురం: విజయవాడలోని మురళి రిసార్ట్స్‌లో జరిగిన రాష్ట్ర స్థాయి దక్షిణ భారత విజ్ఞాన ప్రదర్శనలో కోనసీమ జిల్లా సత్తాచాటింది. మొత్తం 35 ప్రాజెక్టులలో నాలుగు ప్రాజెక్టులు కోనసీమ జిల్లా నుంచి ఎంపికయ్యాయి. వ్యక్తిగత విభాగంలో అల్లవరం మండలం గోడి రెసిడెన్షియల్ పాఠశాలకు చెందిన మ్యాజిక్ అంబ్రెలా, రావులపాలెం మండలం ఊబలంక జెడ్పీ ఉన్నత పాఠశాల నుంచి రైన్ వాటర్ హార్వెస్టింగ్ సిస్టం ఎంపికయ్యాయి. సామూహిక విభాగం నుంచి అమలాపురం రూరల్ మండలం వన్నె చింతలపూడి జెడ్పీ ఉన్నత పాఠశాల నుంచి మల్టీపర్పస్ టూల్ మిషన్, ఉపాధ్యాయ విభాగం నుంచి తొండవరం జెడ్పీ ఉన్నత పా ఠశాల నుంచి వేస్ట్ టు వెల్త్ ప్రాజెక్ట్‌లు ఎంపికయ్యాయి. విజేతలను కలెక్టర్ ఆర్.మహేష్ కుమార్, జేసీ నిషాంతి, డీఈవో ఎస్.కె.సలీం భాషాలు అభినందించారు.
Comments
Please login to add a commentAdd a comment