సమస్యల పరిష్కారం కోరుతూ రేపు సహకార ఉద్యోగుల ధర్నా | - | Sakshi
Sakshi News home page

సమస్యల పరిష్కారం కోరుతూ రేపు సహకార ఉద్యోగుల ధర్నా

Published Sun, Oct 20 2024 3:26 AM | Last Updated on Sun, Oct 20 2024 3:26 AM

సమస్యల పరిష్కారం కోరుతూ రేపు సహకార ఉద్యోగుల ధర్నా

రాజమహేంద్రవరం రూరల్‌: దశాబ్దకాలంగా ఎదుర్కొంటున్న సమస్యలను పట్టించుకోకుండా, 2019 నుంచి ఉద్యోగంలో చేరినవారిని తొలగించాలని డీసీసీబీ డీఎల్‌ఈసీ వారు చేసిన నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ సోమవారం కాకినాడ డీసీసీబీ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహిస్తున్నారు. జిల్లాలో సహకార సంఘాలకు తాళాలు వేసి కాకినాడలో జరిగే కార్యక్రమానికి సహకార ఉద్యోగులందరూ హాజరుకావాలని ఏపీ స్టేట్‌ అగ్రికల్చర్‌ కో ఆపరేటివ్‌ సొసైటీ ఎంప్లాయీస్‌ యూనియన్‌ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు కేవీవీ సత్యనారాయణ, సీహెచ్‌ వెంకటేశ్వరరావు ఓ ప్రకటనలో తెలిపారు. జోవీలు 36, 90 ప్రకారం వేతనాలను, ఇతర ప్రయోజనాలను వెంటనే అమలు చేయాలన్నారు. 2016 ఏప్రిల్‌ ఒకటి నుంచి మోనిటరీ బెనిఫిట్లు, రిటైర్‌మెంట్‌ బెనిఫిట్లు, ,గ్రాట్యూటీ చట్ట ప్రకారం అమలు చేయాలన్నారు. రాష్ట్ర, జిల్లా సహకార బ్యాంకులు కలిసి డిస్ట్రిక్ట్‌ లెవెల్‌ సపోర్టు ఫండ్‌ ఏర్పాటు చేయాలన్నారు. సహకార సంఘాలలోని ఖాళీలను వెంటనే భర్తీచేయాలని, సీఈవో ఖాళీలను కింది సిబ్బందితో పూరించాలన్నారు. 2019 తరువాత నుంచి సహకార సంఘాల్లో పనిచేస్తున్న సిబ్బందిని రెగ్యులర్‌ చేయాలని, డీసీసీబీ డీఎల్‌ఈసీ కన్వీనర్‌ ఆదేశాలను వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్‌ చేశారు. సహకార శాఖ కమిషనర్‌, రిజిస్ట్రార్‌ ఇచ్చిన ఆదేశాల మేరకు 2011–12 నుంచి సంఘాల షేరు ధనంపై 6 శాతం డివిడెండ్‌ లేదా వడ్డీ తక్షణమే చెల్లించాలని సత్యనారాయణ, వెంకటేశ్వరరావు డిమాండ్‌ చేశారు.

లక్ష్యసాధనకు

ఏకాగ్రత అవసరం

రాజానగరం: గురి తప్పకుండా లక్ష్యాన్ని సాధించడానికి శిక్షణ, ఏకాగ్రత అవసరమని ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ అన్నారు. సంపత్‌ నగరంలోని రాజమహేంద్రి ఇంటర్నేషనల్‌ స్కూల్లో ఏపీ రాష్ట్ర పాఠశాల విద్యాశాఖ, క్రీడా సమాఖ్య ఆధ్వర్యంలో 68వ రాష్ట్ర అంతర్‌ జిల్లాల ఎస్‌జీఎఫ్‌ రైఫిల్‌ షూటింగ్‌ టోర్నమెంట్‌ శనివారం ప్రారంభమైంది. స్కూల్‌ చైర్మన్‌ డాక్టర్‌ టీకే విశ్వేశ్వరరెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో జిల్లా విద్యాశాఖాధికారి వాసుదేవరావు మాట్లాడుతూ క్రీడలలో విజయం సాధించడం ద్వారా పేరు, ప్రఖ్యాతులతో పాటు స్పోర్ట్స్‌ కోటాలో ఉద్యోగాలను కూడా పొందవచ్చన్నారు. జిల్లా పాఠశాల క్రీడా సమాఖ్య కార్యదర్శి ఎస్‌ఆర్‌కేవీ స్వామి మాట్లాడుతూ అండర్‌ 14, 17, 19 విభాగాలలో బాలురు, బాలికలకు ఈ నెల 21 వరకు పోటీలు జరుగుతాయన్నారు. ఇక్కడ విజేతలుగా నిలిచిన వారు మధ్యప్రదేశ్‌లోని భోపాల్‌లో జరిగే జాతీయ స్థాయి పోటీల్లో పాల్గొంటారన్నారు. కార్యక్రమంలో సహాయ కార్యదర్శి రాధాకృష్ణ, డిప్యూటీ డీఈఓ నారాయణ, సీఐ ఎస్పీ వీరయ్యగౌడ్‌, స్కూల్‌ డైరెక్టర్‌ టి.స్వరూప్‌ రెడ్డి, ప్రిన్సిపాల్‌ చంద్రశేఖర్‌, ఎంపీటీసీ సభ్యుడు సదానంద కిశోర్‌ పాల్గొన్నారు.

జీజీహెచ్‌ హెచ్‌డీఎస్‌

కమిటీ నియామకం

కాకినాడ క్రైం: కాకినాడ జీజీహెచ్‌ హెచ్‌డీఎస్‌ (హాస్పిటల్‌ డెవలప్‌మెంట్‌ సొసైటీ) కమిటీ సమావేశం శనివారం కలెక్టర్‌ షణ్మోహన్‌ సగిలి ఆధ్వర్యంలో నిర్వహించారు. కలెక్టర్‌ చైర్మన్‌గా వ్యవహరించనున్న ఈ కమిటీకి కో చైర్మన్‌గా నగర ఎమ్మెల్యే వనమాడి వెంకటేశ్వరరావు కొనసాగుతారు. సభ్యులుగా ఎంపీ తంగెళ్ల ఉదయ శ్రీనివాస్‌, సూపరింటెండెంట్‌ డాక్టర్‌ ఎస్‌.లావణ్య కుమారి, డాక్టర్‌ ఎన్‌టీఆర్‌ యూహెచ్‌ఎస్‌ వీసీ, ఏపీ డీఎంఈ, ఆర్‌ఎంసీ ప్రిన్సిపల్‌ డాక్టర్‌ డీఎస్‌వీఎల్‌ నరసింహం, నగర కమిషనర్‌ భావన, ఏపీఎంఎస్‌ ఐడీసీ ఈఈ సీహెచ్‌ రత్నరాజు, డీసీహెచ్‌ఎస్‌ డాక్టర్‌ ఎస్‌.స్వప్న, డీఎంహెచ్‌ఓ డాక్టర్‌ జె.నరసింహనాయక్‌, జీజీహెచ్‌ అడ్మినిస్ట్రేటర్‌ ఎన్‌.శ్రీధర్‌, గైనకాలజిస్ట్‌ డాక్టర్‌ కొండమూరి సత్యనారాయణ తదితరులు ఎంపికయ్యారు. ఈ సందర్భంగా పలువురు సభ్యులు కలెక్టర్‌ను కలిసి ధన్యవాదాలు తెలిపారు.

ఐడియల్‌కు న్యాక్‌–ఏ గుర్తింపు

బాలాజీచెరువు: ఐడియల్‌ కాలేజ్‌ ఆఫ్‌ ఆర్ట్స్‌ అండ్‌ సైన్స్‌ కళాశాలకు నేషనల్‌ అసెస్‌మెంట్‌ అక్రెడిడేషన్‌ కౌన్సిల్‌ (న్యాక్‌) ఏ గుర్తింపు లభించింది. ఈ మేరకు న్యాక్‌ కార్యాలయం (బెంగళూరు) కళాశాలకు శనివారం సమాచారం ఇచ్చింది. ఈ నెల 3, 4 తేదీల్లో న్యాక్‌ కమిటీ కళాశాలలో పర్యటించి విద్యా విధానం, వనరులు, తదితర అంశాలను పరిశీలించింది. గతంలో న్యాక్‌ కమిటీ బి హోదా కల్పించగా తాజాగా 3.18 స్కోర్‌తో ఏ హోదా కల్పించింది. ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ తలాటం సత్యనారాయణ, కరస్పాండెంట్‌ పి.చిరంజీవిని కుమారి హర్షం వ్యక్తం చేశారు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement