No Headline
పోలీసుల తీరుపై విమర్శలు
రౌతు కస్తూరి కేసు దర్యాప్తులో పోలీసు తీరుపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఆంధ్రా సరిహద్దు ప్రాంతం నుంచి పొట్టపోసుకునేందుకు కడియం నర్సరీల్లో పనికి వచ్చిన కస్తూరి కుటుంబానికి న్యాయం చేయాలంటూ వలస కూలీలు ఆందోళనకు సిద్ధమయ్యారు. వారంతా కడియం పోలీస్‌స్టేషన్ వద్ద నిరసన తెలిపేందుకు సన్నాహాలు చేపట్టారు. ఈలోపు బుర్రిలంక గ్రామానికి చెందిన జనసేన నాయకుడి ఇంటి వద్ద గ్రామంలోని సుమారు 300 మందితో సౌత్ జోన్ డీఎస్పీ భవ్య కిశోర్, కడియం పోలీస్ ఇన్‌స్పెక్టర్ అల్లు వెంకటేశ్వరరావు, సిబ్బంది చర్చలు మొదలు పెట్టారు. ఈ విషయంపై జేగురుపాడు సర్పంచ్, వైఎస్సార్ సీపీ కడియం మండల అధ్యక్షుడు సతీష్‌చంద్ర స్టాలిన్ మాట్లాడుతూ కస్తూరి కేసులో పోలీసులు అధికార పార్టీకి వంతపాడుతున్న ట్లుగా ఉందన్నారు. బాధితులతో చర్చించడానికి ప్రభుత్వ భవనాలు కనిపించకపోవడం విడ్డూరమన్నారు.
Comments
Please login to add a commentAdd a comment