సర్వర్‌ డౌన్‌తో పెన్షన్ల పంపిణీ జాప్యం | - | Sakshi
Sakshi News home page

సర్వర్‌ డౌన్‌తో పెన్షన్ల పంపిణీ జాప్యం

Published Sat, Nov 2 2024 2:10 AM | Last Updated on Sat, Nov 2 2024 2:10 AM

సర్వర్‌ డౌన్‌తో పెన్షన్ల పంపిణీ జాప్యం

సర్వర్‌ డౌన్‌తో పెన్షన్ల పంపిణీ జాప్యం

జిల్లాలో 96.14 శాతం అందజేత

రాజమహేంద్రవరం రూరల్‌: జిల్లాలో నవంబర్‌ నెల పింఛన్ల పంపిణీ సర్వర్‌ సమస్యతో జాప్యమైంది. శుక్రవారం ఉదయం ఏడు గంటల వరకు పింఛన్లు పంపిణీ చేయగా, అనంతరం సర్వర్‌ సమస్య తలెత్తింది. దీంతో సచివాలయ ఉద్యోగులు పింఛన్లు పంపిణీ చేద్దామంటే సర్వర్‌ మొరాయిండంతో మధ్యాహ్నానికి గానీ వారికి కేటాయించిన పింఛన్లు సగం కూడా ఇవ్వలేకపోయారు. ఈ లోగానే పలువురు లబ్ధిదారులు సచివాలయాలకు వచ్చి వాకబు చేస్తుండడంతో సాంకేతిక సమస్య పరిష్కారం కాగానే వెంటనే తిరిగి పంపిణీని ప్రారంభిస్తామని ఉద్యోగులు వారికి చెప్పి పంపించారు. వాట్సాప్‌ గ్రూపుల్లోనూ సైతం లబ్ధిదారులకు సమాచారం ఇచ్చారు. జిల్లాలో రాత్రి 8 గంటల వరకు 96.14 శాతం పింఛన్ల పంపిణీ జరిగింది. 2,38,196 మంది లబ్ధిదారులకు రూ.101.62 కోట్లకు గాను 2,28,995 మందికి రూ.97.69 కోట్లు పంపిణీ చేసినట్టు డీఆర్‌డీఏ పీడీ మూర్తి తెలిపారు.

ఏపీ పేపరుమిల్లులో

A{ò³…-sîæ‹Ü Õ„ýS×æ ˘

రాజమహేంద్రవరం రూరల్‌: ఐటీఐలో ఉత్తీర్ణులైన అభ్యర్థులకు రాజమహేంద్రవరంలోని ఆంధ్ర పేపర్‌మిల్స్‌ లిమిటెడ్‌లో అప్రెంటీస్‌ శిక్షణ కోసం ఈ నెల 8వ తేదీ ఉదయం 9 గంటలకు ధవళేశ్వరం కలెక్టరేట్‌ వెనుక ఉన్న ప్రభుత్వ ఐటీఐలో రాత పరీక్ష నిర్వహిస్తున్నట్లు ప్రిన్సిపాల్‌ ఎల్‌ఆర్‌ఆర్‌ క్రిష్ణన్‌ ఓ ప్రకటనలో పేర్కొన్నారు. ఈ రాత పరీక్షలో వివిధ ట్రేడుల్లో 150 మందిని ఎంపిక చేస్తామన్నారు. వారికి ఏడాది శిక్షణ ఇస్తారని, ఈ కాలంలో సుమారు రూ.8,050 స్టయిఫండ్‌గా అందిస్తారన్నారు. ఆసక్తిగల అభ్యర్థులు తమ దరఖాస్తులను ధవళేశ్వరంలోని ప్రభుత్వ ఐటీఐలో ఈ నెల 7వ తేదీ సాయంత్రం 5 గంటలలోపు అందించాలన్నారు. ఈ అప్రెంటీస్‌ ఎంపిక పరీక్ష కోసం అభ్యర్థులు 100 శాతం పూర్తి చేసిన అప్రెంటీస్‌ ప్రొఫైల్‌ రిజిస్ట్రేషన్‌, ఐటీఐ సర్టిఫికెట్‌, పదో తరగతి సర్టిఫికెట్‌, పాన్‌కార్డ్‌, ఆధార్‌కార్డ్‌లు జిరాక్స్‌ కాపీలతో ప్రభుత్వ ఐటీఐ వద్ద హాజరు కావాలని ప్రిన్సిపాల్‌ కోరారు.

నేడు టీఎన్‌ఏఐ ఏపీ ద్వైవార్షిక సమావేశం

కాకినాడ క్రైం: ది ట్రైన్డ్‌ నర్సస్‌ అసోసియేషన్‌ ఆఫ్‌ ఇండియా (టీఎన్‌ఏఐ) ఆంధ్రప్రదేశ్‌ శాఖ ద్వైవార్షిక సమావేశం శనివారం కాకినాడలో జరగనుంది. ఈ మేరకు, ఆంధ్రప్రదేశ్‌ నర్సెస్‌ అండ్‌ మిడ్‌ వైవ్స్‌ కౌన్సిల్‌ రిజిస్ట్రార్‌, అసోసియేషన్‌ సెక్రటరీ ప్రొఫెసర్‌ కె.సుశీల వివరాలు వెల్లడించారు. కాకినాడలోని వివేకానంద పార్కు సమీపంలో ఉన్న హోటల్‌ ఫ్యాబిన్‌లో జరగనున్న ఈ సదస్సుకు ముఖ్య అతిఽథిగా డాక్టర్‌ ఎన్‌టీఆర్‌ యూహెచ్‌ఎస్‌, ఏపీ డీఎంఈ డాక్టర్‌ డీఎస్‌విఎల్‌ నరసింహం హాజరుకానున్నారన్నారు. సదస్సులో వక్తల విలువైన ఉపన్యాసాలతో పాటు, సైంటిఫిక్‌ పేపర్ల ప్రజెంటేషన్‌, ఇన్నోవేషన్స్‌ ఇన్‌ నర్సింగ్‌ ప్రాక్టీస్‌, ఇంపాక్ట్‌ ఆఫ్‌ నర్సింగ్‌ లీడర్స్‌ అంశాలపై ప్లీనరీ సెషన్లు నిర్వహించనున్నామని తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా వివిధ జిల్లాలకు చెందిన సుమారు 2400 మంది నర్సులు ఈ సదస్సులో పాల్గొంటారన్నారు.

4న వికాసలో జాబ్‌ మేళా

కాకినాడ సిటీ: వికాస ఆధ్వర్యంలో 4వ తేదీ కాకినాడ కలెక్టరేట్‌ ఆవరణలో ఉన్న వికాస కార్యాలయంలో జాబ్‌మేళా నిర్వహిస్తున్నట్లు సంస్థ పీడీ కె.లచ్చారావు శుక్రవారం తెలిపారు. ఈ జాబ్‌ మేళాలో తనిష్క్‌ కంపెనీలో మేనేజర్‌, రిటైల్‌ సేల్స్‌ ఆఫీసర్‌, కోకనాడ బీపీవో సర్వీసెస్‌ కంపెనీలో బీపీవో, డేటా ఎంట్రీ ఆపరేటర్‌, మాక్సీ షీల్డ్‌ కంపెనీలో టెలికాలర్స్‌, రిసెప్షనిస్ట్‌, బీడీఎం, రెప్యూటెడ్‌ ఫార్మా కంపెనీలో టెక్నిషియన్‌ కెమిస్ట్‌, ఐసాన్‌ ఎక్స్‌పీరియన్సెస్‌లో టెలిసేల్స్‌, రిప్రెజంటేటివ్‌, ఇసుజు మోటార్స్‌, హోండాయ్‌ మోబీస్‌, పానాసోనిక్‌ అండ్‌ ఇండో ఎంఐఎం కంపెనీల్లో టెక్నీషియన్‌ ఉద్యోగాలకు ఇంటర్వ్యూలు నిర్వహిస్తున్నట్లు లచ్చారావు తెలిపారు. పై ఉద్యోగాలకు ఎస్‌ఎస్‌సీ, ఇంటర్‌, ఐటీఐ, డిప్లామో, డిగ్రీ, బీటెక్‌ ఉత్తీర్ణులైన 35 ఏళ్ల లోపు అభ్యర్థులు అర్హులన్నా రు. వీరికి రూ.12 వేల నుంచి రూ.25 వేల వరకు జీతం, ఇన్సెంటివ్స్‌, భోజనం, వసతి, రవాణా సౌ కర్యం ఆయా ఉద్యోగాలను బట్టి ఉంటుందన్నా రు. ఆసక్తి గల అభ్యర్థులు కలెక్టరేట్‌ ఆవరణలో ఉన్న వికాస కార్యాలయానికి ఉదయం 9 గంటల కు సర్టిఫికెట్ల జెరాక్స్‌లతో హాజరు కావాలన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement