ఆధార్ తప్పనిసరి
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేసే సంక్షేమ పథకాలను పొందేందుకు ఆధార్ తప్పనిసరి. ఆధార్ చేయించుకుని పదేళ్లు పూర్తయిన వారు తమ కార్డులను అప్డేట్ చేయించుకోవాలి. సాంకేతిక తప్పిదాలుంటే సరి చేసుకోవాలి. ఇలా చేయకపోతే అర్హులు సైతం సంక్షేమ ఫలాలకు దూరమయ్యే ప్రమాదముంది. ఆధార్ కార్డులు అప్డేట్ చేసుకునేందుకు జిల్లాలో ప్రతి ఐదు సచివాలయాలకు ఒక ఆధార్ కేంద్రం చొప్పున మొత్తం 97 ఆధార్ కేంద్రాలను జిల్లాలో ఏర్పాటు చేశాం. డిసెంబర్ 14 వరకూ అప్డేట్ చేసుకునేందుకు అవకాశం ఉంది.
– జె.శంకర్, జిల్లా ఆధార్ కేంద్రాల కో ఆర్డినేటర్, కాకినాడ
Comments
Please login to add a commentAdd a comment