11, 12 తేదీలలో నాలుగు రైళ్ల రద్దు
రాజమహేంద్రవరం సిటీ: విజయవాడ డివిజన్ పరిధిలోని సాంకేతిక పరమైన మరమ్మతుల కోసం ఈ నెల 11, 12వ తేదీలలో జిల్లా మీదుగా రాకపోకలు సాగించే నాలుగు రైళ్లను రద్దు చేస్తూ విజయవాడ డివిజనల్ రైల్వే అధికారులు బుధవారం ప్రకటించారు. 11వ తేదీ కాకినాడ పోర్ట్– విశాఖపట్నం, విశాఖపట్నం–కాకినాడ పోర్ట్(17267/17268), 12వ తేదీ గుంటూరు– విశాఖపట్నం(17239) విశాఖపట్నం – గుంటూరు (17240)రైళ్లను రద్దు చేస్తున్నట్టు అధికారులు ప్రకటించారు. రిజర్వేషన్ చేసుకున్న ప్రయాణికులు రైళ్ల రద్దును గమనించాలని అధికారులు విజ్ఞప్తి చేశారు.
సౌత్ ఇండియా
సైన్స్ ఫెయిర్‌కు ఎంపిక
రాజమహేంద్రవరం రూరల్: ఈ రోజు విజయవాడలో జరిగిన రాష్ట్ర స్థాయి సైన్స్ ఫెయిర్ 2024 –25లో గ్రూప్ క్యాటగిరి నుంచి గోపాలపురం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు చెందిన పదో తరగతి విద్యార్థులు జి.గీత సౌమ్య, ఎస్ జోత్స్న తయారు చేసిన ఫార్మర్స్ ఫ్రెండ్లీ షూ సౌత్ ఇండియా సైన్స్ ఫెయిర్‌కు ఎంపికై నట్టు జిల్లా సైన్స్ అధికారి జీవీఎన్ ఎస్ నెహ్రూ తెలిపారు. ఈ నెల 20 నుంచి 25 వరకు పాండిచ్చేరిలో సౌత్ ఇండియా సైన్స్ ఫెయిర్ జరుగుతుందని తెలిపారు. విజేతలను జిల్లా పాఠశాల విద్యాశాఖాధికారి కె.వాసుదేవరావు, సమగ్ర శిక్షా అడిషనల్ ప్రాజెక్టు కోఆర్డినేటర్ సుభాషిణి అభినందించారు.
Comments
Please login to add a commentAdd a comment