ఆధ్యాత్మిక చైతన్యానికే మహాసభలు
అఖిలాంధ్ర సాధు పరిషత్ అధ్యక్షుడు పరావిద్యానందగిరి స్వామిని
దేవరపల్లి: ప్రజల్లో ఆధ్యాత్మిక, ధార్మిక చైతన్యాన్ని కలిగించడం కోసం సభలు మహాసభలు ఏర్పాటు చేస్తున్నట్టు అఖిలాంధ్ర సాధు పరిషత్ అధ్యక్షులు మాతా పరావిద్యానందగిరి స్వామిని అన్నారు. ఏటా వివిధ ప్రాంతాల్లో సభలు నిర్వహిస్తున్నట్టు చెప్పారు. దేవరపల్లిలోని కరుటూరి ఫంక్షన్ హాల్లో నిర్వహిస్తున్న అఖిలాంధ్ర సాధు పరిషత్ రెండవ రోజు సోమవారం నిర్వహించిన సభలో మాతా విద్యానందగిరి స్వామిని ప్రసంగించారు. మహాసభలకు భక్తుల నుంచి విశేష స్పందన లభిస్తోందన్నారు. దేవరపల్లి, నల్లజర్ల, చాగ ల్లు, కొవ్వూరు, గోపాలపురం, తాళ్లపూడి మండలా ల్లోని పరిసర గ్రామాలకు చెందిన భక్తులు భారీగా తర లి వచ్చి స్వాముల ఆధ్యాత్మిక ధర్మ ప్రబోధాలను భక్తి శ్రద్ధలతో ఆలకించారు. ఉదయం 8 నుంచి మధ్యా హ్నం 12.30 గంటల వరకు, సాయంత్రం 3.30 నుంచి రాత్రి 7.30 గంటల వరకు సభలు నిర్వహించారు. పరిషత్ అధ్యక్షులు మాతా పరవిద్యానందగిరి స్వామిని ఆధ్వర్యంలో మహాసభలు నిర్వహిస్తున్నారు. హిందూమతం ప్రాధాన్యం గురించి స్వామిజీలు వివరిస్తున్నారు. మానవులంతా సన్మార్గంలో నడవాలని స్వామీజీలు సూచించారు. సత్యానందాశ్రమ పీఠాధిపతులు హరితీనకథ్ధ స్వాముల అధ్యక్షతన జరిగిన సభలో పలువురు పీఠాధిపతులు, ఆశ్రమాల స్వామీజీలు ప్ర సంగించారు. సభలో పీఠాధిపతులు కమలానంద భా రతీ స్వామి, విశ్వంభరానంద గిరి స్వామి, పరబ్రహ్మానందగిరి స్వామిని, సత్యానందగిరిస్వామి, శుద్ధబ్రహ్మానందగిరి స్వామి, ప్రేమానంద భారతీ స్వామి, వీరానంద బ్రహ్మచారి, నిర్విశేషానందగిరి స్వామిని, సనకసనందన సరస్వతీ స్వామి ఆధ్యాత్మిక ధర్మ ప్రబోధాలు చేశారు. రాత్రి సభ అనంతరం సాంస్కృతిక కార్యక్రమాల్లో భాగంగా కూచిపూడి నృత్య ప్రదర్శన భక్తులను అలరించింది. ఆహ్వాన సంఘం సభ్యులు పీఠాధిపతులు, స్వాములను సత్కరించి ఆశీర్వాదం పొందారు. వ్యాపారి కరుటూరి ధనుంజయ, రోజా దంపతులను పీఠాధిపతులు, సాధు పరిషత్ అధ్యక్షులు మాతా పరావిద్యానందగిరి స్వామిని సత్కరించి ఆశీస్సులు అందజేశారు. ఆహ్వాన కమిటీ సభ్యు లు గద్దే మునేశ్వరరావు, బళ్ళ సూర్యచక్రం, బలుసు సత్యనారాయణ, యాగంటి వెంకటేశ్వరరావు, సుంకవల్లి వెంకటరామారావు, ఆచంట వెంకటసత్యనారాయణ, గన్నమని హరికృష్ణ, కరుటూరి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో సభలకు ఏర్పాట్లు చేశారు.
Comments
Please login to add a commentAdd a comment