సొసైటీ ఉద్యోగుల ధర్నా
రాజమహేంద్రవరం రూరల్: ఏపీ రాష్ట్ర ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల ఉద్యోగుల యూనియన్ పిలుపు మేరకు సోమవారం జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద తమ డిమాండ్లను నెరవేర్చాలని కోరుతూ సొసైటీ ఉద్యోగులు ధర్నా నిర్వహించారు. ఈ ధర్నాలో జీవో 36 ప్రకారం పేస్కేల్స్ అమలు పరచాలని, గ్రాట్యుటీ చట్ట ప్రకారం ఇవ్వాలని, ఉద్యోగుల ఉద్యోగ విరమణ వయస్సు 62 ఏళ్లకు పెంచాలని, 2019 తరువాత ఉద్యోగులను రెగ్యులర్ చేయాలని కోరారు. అనంతరం డీఆర్‌ఓ సీతారామ్మూర్తికి వినతి పత్రం అందజేశారు. రాష్ట్ర యూనియన్ అధ్యక్షుడు తోట వెంకటరామయ్య, జిల్లా అధ్యక్షుడు కేవీవీ సత్యనారాయణ, ప్రధాన కార్యదర్శి సీహెచ్ వెంకటేశ్వరరావు, వర్కింగ్ ప్రెసిడెంట్ డి.రామచంద్రం, కోశాధికారి జి.సుధాకర్ వర్మ పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment