త్వరలో మరో 10 ఓపెన్ ఇసుక రీచ్‌లు
రాజమహేంద్రవరం సిటీ: జిల్లాలో 9 ఓపెన్ రీచ్‌ల వద్ద 5,51, 000 మెట్రిక్ టన్నులు, 10 డీసిల్టేషన్ పాయింట్ల వద్ద 5,37,018 మెట్రిక్ టన్నుల ఇసుక అందుబాటులో ఉందని, త్వరలో మరో 10 ఓపెన్ రీచ్‌లు, ఆరు సెమీ మెకనైజ్డ్ రీచ్‌ల ద్వారా 77 లక్షల మెట్రిక్ టన్నుల ఇసుక అందుబాటులోకి తీసుకొస్తామని కలెక్టర్ పి.ప్రశాంతి తెలిపారు. సోమవారం జిల్లా కలెక్టర్ చాంబర్‌లో జిల్లా స్థాయి ఇసుక కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ ప్రశాంతి మాట్లాడుతూ, మార్గదర్శకాల ప్రకారం బోట్స్ మ్యాన్ సొసైటీ సభ్యులను ఇసుక రీచ్‌లలో తవ్వకాలు, లోడింగ్‌కు అనుమతించామన్నారు. నిడదవోలు మండలం పురుషోత్తంపల్లి రీచ్‌కి ఫిబ్రవరి 10, కొవ్వూరు ఆరికిరేవుల రీచ్ 11న , తాళ్లపూడి మండలం తాడిపూడి, పక్కిలంక రీచ్ 12న, నిడదవోలు మండలం పెండ్యాల, కొవ్వూరు మండలం చిడిపి, సీతానగరం మండలం సింగవరం ఇసుక రీచ్‌లకు ఫిబ్రవరి 13 న పబ్లిక్ హియరింగ్ చేపట్టనున్నట్లు తెలిపారు. అందుకు అనుగుణంగా ఆర్డీవోలు పూర్తి స్థాయిలో సన్నద్ధం కావాలన్నారు. కొత్తగా గుర్తించిన కడియం మండలం వేమగిరి ఏ, పెరవలి మండలం తీపర్రు ఏ, బి లు, నిడదవోలు మండలం జీడిగుంట ఏ, బిలు, పందలపర్రులో కొత్తగా గుర్తించిన సెమీ మెకనైజ్డ్ రీచెస్ మైనింగ్ ప్లాన్ అనుమతికి ప్రతిపాదనలను సిద్ధం చేసుకుని, ఇరిగేషన్ అధికారుల ద్వారా అనుమతులు తీసుకోవాలని పేర్కొన్నారు. జిల్లాలో ఇసుక రవాణా చేస్తూ నియమ నిబంధనలను ఉల్లంఘించిన 77 వాహనాలను సీజ్ చేసి, నాలుగు కేసులు నమోదు చేశామన్నారు. 480 మెట్రిక్ టన్నుల ఇసుకను సీజ్ చెయ్యడం, రూ.24,71,000 అపరాధ రుసుం విధించడం, యంత్ర పరికరాల వాడకం, అధిక మొత్తంలో డబ్బు వసూలు చేస్తున్న నేపథ్యంలో మూడు రీచ్‌లకు చెందిన కాంట్రాక్టు ఉత్తర్వులు రద్దు చేశామన్నారు. జాయింట్ కలెక్టర్ ఎస్.చిన్న రాముడు, ఆర్డీవోలు ఆర్.కృష్ణనాయక్, రాణి సుస్మిత, జిల్లా మైన్స్ అధికారి డి.ఫణిభూషణ్‌రెడ్డి, ఈఈ (ఇరిగేషన్ రివర్ కన్సర్వేటరీ) ఆర్.కాశీ విశ్వేశ్వరరావు, జిల్లా రవాణా అధికారి ఆర్.సురేష్, జిల్లా ఆర్‌డబ్ల్యూఎస్ అధికారి బీవీ గిరి, ఇన్చార్జి డీపీవో ఎం.నాగలత, జిల్లా వ్యవసాయ అధికారి ఎస్.మాధవరావు, ఇరిగేషన్ డీఈ బాబు, పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అధికారులు పాల్గొన్నారు.
సమావేశంలో మాట్లాడుతున్న కలెక్టర్ ప్రశాంతి
Comments
Please login to add a commentAdd a comment