![ప్రత్యేక పూజలు చేయిస్తున్న హైకోర్టు నాయ్యమూర్తి మధుసూదనరావు దంపతులు - Sakshi](/styles/webp/s3/article_images/2023/07/3/02dpeg04-290010_mr.jpg.webp?itok=tq-ZI5rT)
ప్రత్యేక పూజలు చేయిస్తున్న హైకోర్టు నాయ్యమూర్తి మధుసూదనరావు దంపతులు
పెదవేగి : మండలంలోని రాట్నాలకుంటలోని రాట్నాలమ్మవారి ఆలయాన్ని ఆదివారం హైకోర్టు న్యాయమూర్తి తల్లాప్రగడ మధుసూదనరావు దంపతులు సందర్శించారు. ముందుగా న్యాయమూర్తి దంపతులకు ఆలయ కమిటీ సభ్యులు మర్యాదపూర్వక స్వాగతం పలికారు. అనంతరం న్యాయమూర్తి ఆలయంలో అమ్మవారికి ప్రత్యేక పూజలు చేయించారు. ఆలయ కమిటీ సభ్యులు ఆయన్ను ఘనంగా సత్కరించారు. భీమడోలు జూనియర్ సివిల్ జడ్జి రిషిక్ ఆయన వెంట ఉన్నారు.
పోటెత్తిన భక్తులు
అమ్మవారి దర్శనానికి భక్తులు పోటెత్తారు. ఆలయానికి ఒక్కరోజు ఆదాయం రూ.75,439 లభించిందని ఈఓ ఎన్.సతీష్‌కుమార్ తెలిపారు. పూజా టికెట్ల ద్వారా రూ.34,565, విరాళాల రూపంలో రూ.11,417, లడ్డూ విక్రయాల ద్వారా రూ.28,125, ఫొటోల అమ్మకం ద్వారా రూ.1,332, ఆదాయం లభించిందన్నారు. ఆల య చైర్మన్ చల్లగొళ్ల వెంకటేశ్వరరావు ఆలయం వద్ద ఏర్పాట్లను పర్యవేక్షించారు.
వంతెన పనుల పరిశీలన
లింగపాలెం: లింగపాలెం నుంచి కొత్తపల్లి వెళ్లే రహదారిలోని పేరంటాలు చెరువు అలుగు చానల్‌పై వంతెన నిర్మాణానికి ఏలూరు ఎంపీ కోటగిరి శ్రీధర్ రూ.33 లక్షల నిధులు మంజూరు చేశారు. ఆదివారం వంతెన నిర్మాణ పనులను ఆయన పరిశీలించారు. వర్షాకాలంలో అలుగు చానల్‌పై వరద ప్రవహిస్తుండటంతో రాకపోకలకు ప్రజలు ఇబ్బందులు పడేవారని, వంతెన నిర్మాణం పూర్తయితే ఇబ్బందులు తొలగుతాయని ఎంపీ శ్రీధర్ అన్నారు. త్వరితగతిన వంతెన పనులు పూర్తి చేయాలని కాంట్రాక్టర్‌కు ఆదేశించారు. పనుల్లో నాణ్యతా ప్రమాణాలు లోపిస్తే సహించమని అన్నారు. వైఎస్సార్ సీపీ నాయకులు చెలికాని చిట్టియ్య, కోటగిరి హరీష్, కోటగిరి ధీరాజ్, పి.వాసురెడ్డి, సీహెచ్ రఘనాథరెడ్డి, ఓ.ప్రభాకర్, శావా రాజేష్ ఆయన వెంట ఉన్నారు.
ఎంఈఓ–1 పోస్టులకు కౌన్సెలింగ్ పూర్తి
ఏలూరు (ఆర్‌ఆర్‌పేట): పాఠశాల విద్యాశాఖ జోన్–2 (ఉమ్మడి కృష్ణ, ఉభయగోదావరి జిల్లాల ప్రాతిపదికన) పరిధిలో ఎంఈఓ–1 పోస్టుల భర్తీకి కాకినాడ ఆర్‌జేడీ కార్యాలయంలో ఆదివారం కౌన్సెలింగ్ నిర్వహించారు. దీంతో ప్రభుత్వ యాజమాన్యాల్లో పనిచేస్తున్న గ్రేడ్–2 ప్రధానోపాధ్యాయులు ఎంఈఓ–1గా కొలువుదీరనున్నారు. నిమ్మగడ్డ రవీంద్రభారతి (ఏలూరు) ఉంగుటూరు, మాణిక్యం తిరుమల దాసు (కొవ్వూరు) దేవరపల్లి, ముదావతు సేవ్య (తాడేపల్లిగూడెం) నూజివీడు, అల్లూరి రవిప్రకాష్ (కై కలూరు) ఏలూరు రూరల్, కురిసేటి నాగవెంకట గణేష్ (చింతలపూడి) నిడదవోలు, ఆకెళ్ల వెంకట నాగ వరప్రసాద్ (గోపన్నపాలెం) దెందులూరు, వై.సత్యనారాయణ (వేగేశ్వరపురం) నల్లజర్ల, పెన్మెత్స వెంకట శివ నాగరాజు (అత్తిలి) పాలకోడేరు, డి.మురళీ సత్యనారాయణ (నిడదవోలు) తణుకు, ఎన్.మనోహరం (నరసాపురం) రాజోలు, బీబీఎస్ స్వరూప్ (పోలవరం) పెరవలి, చెక్కా సెక్షణ రాజు (పెంటపాడు) ఉండ్రాజవరం, కేవీవీఎస్ సుబ్రహ్మణ్యం (పెరవలి) కాట్రేనికోన, జీవీఎస్ విజయకుమార్ (ఆచంట) పోడూరు, ఈ.శ్రీని వాసరావు (కొయ్యలగూడెం) భీమడోలు, రామ్ బాల సింగ్ (యండగండి) బాపులపా డు, ఎన్.రమేష్ (మోపిదేవి) అత్తిలి మండల విద్యాశాఖాధికారులు (ఎంఈఓ)గా నియమితులయ్యారు. వీరిని సోమవారం ప్రస్తుత విధుల నుంచి విడుదల చేయాలని సంబంధిత ఉప విద్యాశాఖాధికారులను ఆర్‌జేడీ జి.నాగమణి ఆదేశించారు.
శాకంబరి.. శుభంకరి
మొగల్తూరు: ముత్యాలపల్లిలో బండి ముత్యా లమ్మ ఆలయంలో అమ్మవారిని ఆదివారం శాకంబరిగా అలంకరించారు. ఆషాఢ మాసా న్ని పురస్కరించుకుని కూరగాయలు, పండ్లతో ప్రత్యేకంగా అలంకరించి పూజలు చేశారు. మరో రెండు రోజులపాటు అలంకరణ ఉంటుందని ఆలయ చైర్మన్ రామారావు తెలిపారు.
![అలుగు చానల్‌పై నిర్మిస్తున్న వంతెన పనులను పరిశీలిస్తున్న ఎంపీ శ్రీధర్
1](https://www.sakshi.com/gallery_images/2023/07/3/02jrglin01-290012_mr.jpg)
అలుగు చానల్‌పై నిర్మిస్తున్న వంతెన పనులను పరిశీలిస్తున్న ఎంపీ శ్రీధర్
Comments
Please login to add a commentAdd a comment