ఏలూరు (టూటౌన్): రాష్ట్రంలో ఈనెల 11, 12 తేదీల్లో జరిగే ఏజెన్సీ ప్రాంత బంద్‌కు సీపీఎం పార్టీ సంపూర్ణ మద్దతు ప్రకటిస్తున్నట్టు ఆ పార్టీ జిల్లా కార్యదర్శి ఎ.రవి సోమవారం ఓ ప్రకటనలో తెలిపారు. 1/70 చట్ట సవరణను నిరసిస్తూ, జీఓ నం.3ను పునరుద్ధరించాలని, గిరిజనుల హక్కులు పరిరక్షించాలని కోరుతూ రెండు రోజులపాటు ఏజెన్సీ మండలాల్లో జేఏసీ ఆదివాసీ గిరిజన సంఘ ఆధ్వర్యంలో బంద్ చేపట్టారని పేర్కొన్నారు. ఏజెన్సీ బంద్‌ను విజయవంతం చేయాలని రైతుకూలీ సంఘం జిల్లా కార్యదర్శి షేక్ బాషా పిలుపు నిచ్చారు. సోమవారం ప్రకటన విడుదల చేశారు.
శిశు ఆధార్ సేవలు
ఏలూరు (టూటౌన్): ఏలూరు జిల్లాలో వైద్య ఆరోగ్యశాఖ, కామన్ సర్వీస్ సెంటర్ల ఆధ్వర్యంలో 0–5 ఏళ్ల చిన్నారులకు ఉచిత ఆధార్ సే వలు ఏలూరు ప్రభుత్వ ఆస్పత్రిలో ప్రారంభించామని ఆస్పత్రి సూపరింటెండెంట్ ఎంఎస్ రాజు తెలిపారు. స్థానిక ప్రభుత్వ ఆస్పత్రిలోని కామన్ సర్వీస్ సెంటర్‌లో జరిగిన కార్యక్రమంలో సోమవారం ఆయన మాట్లాడుతూ ప్రభు త్వ ఆస్పత్రిలో పుట్టిన పిల్లలకు బర్త్ సర్టిఫికెట్‌తో పాటు ఆధార్ నమోదు చేయాలని ప్రభుత్వ ఆదేశాల మేరకు కామన్ సర్వీస్ సెంటర్ ద్వారా ఈ కార్యక్రమం చేపట్టామన్నారు. గైనిక్ విభాగాధిపతి లావణ్య, నర్సింగ్ సూపరింటెండెంట్ విజయలక్ష్మి పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment