![డిప్యూటీ స్పీకర్‌పై ఫిర్యాదు](https://www.sakshi.com/styles/webp/s3/article_images/2025/02/11/10bvrmplk01-290043_mr-1739217587-0.jpg.webp?itok=IER5ICb9)
డిప్యూటీ స్పీకర్‌పై ఫిర్యాదు
పాలకోడేరు: రాష్ట్ర శాసనసభ డిప్యూటీ స్పీకర్, ఉండి ఎమ్మెల్యే కనుమూరి రఘురామకృష్ణరా జు అండతో ఆయన అనుచరులు తనపై తప్పు డు కేసులు బనాయించి వేధిస్తున్నారని సీనియ ర్ జర్నలిస్టు, సమాచార హక్కు చట్టం ప్రొటెక్షన్ కౌన్సిల్ రాష్ట్ర కార్యదర్శి కె.రవికుమార్ ఆవేదన వ్యక్తం చేశారు. ఫ్రీ లాన్స్ జర్నలిస్టుగా పనిచేస్తున్న తనకు రక్షణ కల్పించాలని, తనపై తప్పు డు ఫిర్యాదు చేసిన వారిని శిక్షించాలని కోరుతూ సోమవారం పాలకోడేరు పోలీసులకు ఫిర్యాదు చేశారు. సమాచార హక్కుచట్టం ప్రకారం నిజా లు తెలుసుకుని పోరాటం చేస్తున్నానని, దీనిలో భాగంగా పశ్చిమగోదావరి కలెక్టరేట్‌ను భీమవరం నుంచి తరలించే యత్నాలను అడ్డుకుంటూ అఖిల పక్ష కమిటీని కూడా ఏర్పాటు చేసు కున్నామని రవికుమార్ తెలిపారు. ఉండి ని యోజకవర్గంలో పేదల ఇళ్లను అకారణంగా కూల్చివేస్తున్నారని, వాటిని అడ్డుకునే క్రమంలో వార్తలు రాశారన్నారు. కలెక్టరేట్‌ను గతంలో భీమవరం మార్కెట్ యార్డు స్థలంలో మంజూ రు చేసి అప్పటి ప్రభుత్వం నిధులు కూడా మంజూరు చేసిందని గుర్తుచేశారు. ప్రస్తుతం దానిని మార్చి పెదఅమిరంలో డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు ఇంటి పక్కకు మార్చుకునేందుకు యత్నిస్తున్నారని, దీనిపై కూడా వార్తలు రాశానన్న కక్షతో వేధిస్తున్నారని రవికుమార్ ఫిర్యాదులో పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment