స్పందన | - | Sakshi
Sakshi News home page

స్పందన

Published Tue, Feb 11 2025 1:40 AM | Last Updated on Tue, Feb 11 2025 1:40 AM

 స్పం

స్పందన

కూటమి నాయకుల కోడ్‌ ఉల్లంఘన

ఏలూరు (టూటౌన్‌): పట్టభద్రుల ఎమ్మెల్సీ కూ టమి అభ్యర్థిగా పేరాబత్తుల రాజశేఖర్‌ నామినేషన్‌ దాఖలు ప్రక్రియలో కూటమి నాయకులు ఎన్నికల కోడ్‌ ఉల్లంఘనలకు పాల్పడ్డారు. ని బంధనలు అతిక్రమిస్తూ ఏలూరు కలెక్టరేట్‌ వద్ద గేటు వరకూ వందలాది మంది టీడీపీ, జనసేన, జీజేపీ నాయకులు చేరుకున్నారు. అడ్డు చెప్పలేని పరిస్థితుల్లో పోలీసులు, ఎన్నికల అధికారులు చోద్యం చూస్తూ ఉండిపోయారు. 100 మీటర్లు తర్వాత ఐదుగురిని మాత్రమే లోపలికి పంపించాల్సి ఉండగా వందలాది మంది కలెక్టరేట్‌ గేటు వరకు రావడం, కలెక్టరేట్‌లోనికి సైతం ఎమ్మెల్యేలు, మంత్రులు వాళ్ల అనుచరు లు పెద్ద ఎత్తున వెళ్లడం కనిపించింది. ఈ క్ర మంలో ఎమ్మెల్సీ ఎన్నికలు సజావుగా సాగేనా అంటూ ప్రజల్లో చర్చ సాగింది.

చాట్రాయి.. కోడ్‌ పట్టదోయి

చాట్రాయి : చాట్రాయి మండలంలో ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్‌ పూర్తిస్థాయిలో అమలు కావడం లేదు. కొన్ని గ్రామాల్లో రాజకీయ నాయకుల విగ్రహాలు, ఫ్లెక్సీలకు ముసుగులు వేసిన అధికారులు కోటపాడు, చీపురుగూడెం గ్రామాల్లో మాత్రం విస్మరించారు. కోడ్‌ అమలులో అధికా రుల నిర్లక్ష్యానికి ఇది అద్దంపడుతుందని గ్రామస్తులు అంటున్నారు.

ఎట్టకేలకు కనెక్షన్‌ ఇచ్చారు

ముసునూరు : ‘స్తంభం వేశారు.. కనెక్షన్‌ మరిచారు.’ శీర్షికన సోమ వారం ‘సాక్షి’లో ప్రచురించిన కథనానికి విద్యు త్‌ అధికారు లు స్పందించారు. ము సునూరులో వలసపల్లి వెళ్లే ప్రధాన రహదారి సమీపంలోని బడుగువారిగూడెం అంతర్గత రోడ్డులో కొత్తగా వేసిన విద్యుత్‌ స్తంభానికి ఏఈ వీరబాబు ఆధ్వర్యంలో విద్యుత్‌ కనెక్షన్‌ ఇచ్చారు. సమస్య పరిష్కారానికి కృషి చేసిన ‘సాక్షి’కి స్థానికులు ధన్యవాదాలు తెలిపారు.

ఇంటర్‌ ప్రాక్టికల్స్‌కు 4,592 మంది హాజరు

ఏలూరు (ఆర్‌ఆర్‌పేట): జిల్లాలో సోమవారం 55 కేంద్రాల్లో ఇంటర్మీడియెట్‌ జనరల్‌, ఒకేషనల్‌ విద్యార్థులకు ప్రాక్టికల్స్‌ నిర్వహించారు. 4,789 మంది విద్యార్థులకు 4,592 మంది హాజరయ్యారు. ఉదయం షిఫ్టులో 2,842 మందికి 2,702 మంది, మధ్యాహ్నం షిఫ్టులో 1,947 మందికి 1,890 మంది హాజరయ్యారు. పరీక్షలు ప్రశాంతంగా జరిగాయని, మాల్‌ ప్రాక్టీస్‌ కేసు లు నమోదు కాలేదని ఇంటర్‌ బోర్డు ప్రాంతీయ పర్యవేక్షణాధికారి కె.యోహాన్‌ తెలిపారు.

ఏప్రిల్‌లో కలెక్టరేట్‌ వద్ద ధర్నా

ఏలూరు (టూటౌన్‌) : ఏలూరు కలెక్టరేట్‌ వద్ద ఏప్రిల్‌ 28న వెయ్యి డప్పులతో దళిత సేన ఆధ్వర్యంలో మహాధర్నా నిర్వహించనున్నట్టు సంఘం రాష్ట్ర అధ్యక్షుడు జిజ్జువరపు రవిప్రకాష్‌ తెలిపారు. స్థానిక ఆర్‌ఆర్‌పేటలోని సంఘం కార్యాలయంలో సోమవారం కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో డప్పు కళాకారులు, చర్మకారులకు పెన్షన్‌ను రూ.6 వేలకు పెంచాలని డిమాండ్‌ చేశారు. సంక్షేమ పథకాలు అమలు చేయాలని, సబ్సిడీ రుణాలు అందజేయాలని, లిడ్‌ క్యాప్‌ను ప్రక్షాళన చే యాలని కోరారు. ఆయా డిమాండ్ల సాధనకు దళిత సేన మహాధర్నా నిర్వహించనున్నామన్నారు. రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, తూర్పుగోదా వరి జిల్లా ఇన్‌చార్జి కాకర్లమూడి వెంకటరావు, ఏలూరు జిల్లా మహిళా అధ్యక్షురాలు బేతాళ జయసుధ, పశ్చిమగోదావరి అధ్యక్షుడు చీలి మోహనరావు తదితరులు పాల్గొన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
 స్పందన 1
1/4

స్పందన

 స్పందన 2
2/4

స్పందన

 స్పందన 3
3/4

స్పందన

 స్పందన 4
4/4

స్పందన

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement