రాష్ట్రస్థాయి సైన్స్ ఫెయిర్‌కు గురుకుల విద్యార్థులు
తాడేపల్లిగూడెం రూరల్ : తాడేపల్లిగూడెం మండలం ఆరుగొలను డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ సాంఘిక, సంక్షేమ గురుకుల పాఠశాల విద్యార్థులు రాష్ట్ర స్థాయి సైన్స్ ఫెయిర్‌కు ఎంపికైనట్లు ప్రిన్సిపాల్ బీహెచ్ శ్రీనివాస్ బుధవారం తెలిపారు. జోనల్ స్థాయిలో ద్వారకాతిరుమలలో జరిగిన సైన్స్ ఫెయిర్‌లో మ్యాథ్స్, సైన్స్ విభాగంలో తమ విద్యార్థులు జె.శుభాకర్, ఎం.నాగరిషి, కే హేమంత్, బి.ఉదయ్ ఉత్తమ ప్రతిభ కనబర్చారన్నారు. ఈ సందర్భంగా విద్యార్థులను గోపాలపురం, తాడేపల్లిగూడెం ఎమ్మెల్యేలు మద్దిపాటి వెంకట్రాజు, బొలిశెట్టి శ్రీనివాస్, జిల్లా సమన్వయాధికారిణి ఎన్.భారతి అభినందించారు.
యనమదుర్రు డ్రెయిన్‌లో దూకిన వ్యక్తి కోసం గాలింపు
భీమవరం: పట్టణంలోని కాలిబాట వంతెన పైనుంచి యనమదుర్రు డ్రెయిన్‌లోనికి వ్యక్తి దూకినట్లు సమాచారం అందడంతో కాలువ పరిసరాల్లో గాలించినట్లు భీమవరం ఫైర్ ఆఫీసర్ సీహెచ్ సూర్యప్రకాశరావు బుధవారం చెప్పారు. వ్యక్తి కాలువలోనికి దూకినట్లు తెలియడంతో పోలీసులు, ఫైర్ సిబ్బంది అప్రమత్తమై గాలింపు చర్యలు చేపట్టగా ఆచూకీ లభించలేదన్నారు. దీనిపై ఎటువంటి ఫిర్యాదు అందలేదని సూర్యప్రకాశరావు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment