తొలగించిన అర్హుల పేర్లు చేర్చాలి
వేలేరుపాడు: పోలవరం ప్రాజెక్ట్ ముంపులో ఉన్న ఇంటి విలువల లిస్ట్ నుంచి తొలగించిన అర్హుల పేర్లు యాడ్ చేయాలని సీపీఎం ఏలూరు జిల్లా కార్యదర్శి ఏ.రవి డిమాండ్ చేశారు. కారం వెంకట్రావు అధ్యక్షతన జరిగిన వేలేరుపాడు మండల సమీక్షా సమావేశంలో రవి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వాలు మారుతున్నాయి కానీ నిర్వాసితుల సమస్య పరిస్కారం చేయట్లేదన్నారు. ఎవరు అధికారంలోకి వచ్చినా ప్రాజెక్టు గురించి మాట్లాడుతున్నారే తప్ప నిర్వాసితుల గురించి మాట్లాడకపోవడం, వారి సమస్యలు పట్టించకపోవడం బాధాకరమని మండిపడ్డారు. మొదటి కాంటూర్‌లో తీసుకున్న గ్రామాలలో అర్హత కలిగిన లబ్ధిదారుల పేర్లు లిస్టులో నుంచి తీసేసి నిర్వాసితులను గందరగోళం పడేసి వారి జీవితాలతో చెలగాటం ఆడుతున్నారని దుయ్యబట్టారు. సమావేశానికి జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు తెల్లం రామకృష్ణ, జిల్లా వర్గ సభ్యురాలు నాగమణి, మండల కార్యదర్శి ధర్ముల రమేష్ పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment