● ముంచెత్తిన వాన
ఒక్కసారిగా దంచి కొట్టిన వానతో ఏలూరు నగర వాసులు ఇబ్బంది పడ్డారు. బుధవారం మధ్యాహ్నం 2.15 గంటల నుంచి సుమారు గంట సేపు భారీ వర్షం కురిసింది. దీంతో నగరంలోని అన్ని ప్రధాన రోడ్లు నీటమునిగాయి. డ్రైనేజీలు పొంగిపొర్లడంతో మురుగు నీరు రోడ్లపై ప్రవహించింది. దీపావళి సందర్భంగా కొనుగోలు కోసం బయటకు వచ్చిన ప్రజలు తీవ్ర అసౌకర్యానికి గురయ్యారు. పవరుపేట లో బ్రిడ్జి పూర్తిగా మునిగి పోయింది. దీంతో వన్‌టౌన్ నుంచి టూటౌన్ ప్రాంతానికి రాకపోకలు నిలిచిపోయాయి. నగరంలోని అమీనాపేట, ఆర్‌ఆర్ పేట, పవర్‌పేట, ప్రభుత్వ ఆస్పత్రి రోడ్డు, కొత్తపేట, రైల్వే స్టేషన్ రోడ్డు ఇలా ఏ రోడ్డు చూసినా జలమయమైంది. – ఏలూరు (టూటౌన్)
Comments
Please login to add a commentAdd a comment