శ్రుతి మించిన చింతమనేని ఆగడాలు
సాక్షి టాస్క్‌ఫోర్స్: దెందులూరు నియోజకవర్గంలో మద్యం షాపు పెట్టాలంటే ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ అనుమతి తప్పనిసరి. లాటరీలో మద్యం దుకాణం పొందినా కూడా చింతమనేనికి పర్సంటేజ్‌ల్లో బేరం కుదరకపోతే అంతే సంగతులు. ఎదుటి వ్యక్తి కాళ్ల బేరానికి వచ్చేవరకు బెదిరింపులు కొనసాగుతాయి. దెందులూరు మండలంలో మద్యం దుకాణానికి తెలంగాణ రాష్ట్రం ఖమ్మం జిల్లా వాసి కంటెం వినోద్‌కుమార్ టెండర్ వేయగా ఒక షాపు అతనికి దక్కింది. అప్పటి నుంచి షాపు పెట్టేందుకు వినోద్‌కుమార్ విశ్వప్రయత్నం చేస్తున్నా, ఏ గ్రామంలోనూ మద్యం దుకాణం పెట్టనీయకుండా ప్రభాకర్ అడ్డుపడుతున్నాడు. ఎకై ్సజ్ నిబంధనల మేరకు నెలాఖరుకు దుకాణం పెట్టకపోతే లైసెన్స్ రద్దు చేస్తారనే కారణంతో కంటైనర్ ద్వారా పెదవేగి మండలం ఏడవమైలు రాయి వద్ద లిక్కర్ షాప్ పెట్టి అమ్మకాలు ప్రారంభించాడు. దీన్ని గుర్తించి చింతమనేని ఎకై ్సజ్, పోలీసు సిబ్బందిని రంగంలోకి దింపారు. పోలవరం నుంచి అక్రమ లిక్కర్ తెచ్చి అమ్ముతున్నాడని, కంటైనర్‌లో దొంగతనం జరిగిందంటూ ఎకై ్సజ్, పోలీస్ అధికారుల సాయంతో కంటైనర్‌ను బుధవారం తెల్లవారుజామున తీసుకుపోయారు.
Comments
Please login to add a commentAdd a comment