ప్రత్యేక డీఎస్సీ కోరుతూ ధర్నా
బుట్టాయగూడెం: ఏజెన్సీ ప్రాంతంలో ప్రత్యేక డీఎస్సీ నోటిపికేషన్ ప్రకటించాలని కోరుతూ ఆదివాసీ సంక్షేమ పరిషత్, ఆదివాసీ సేన, ఆదివాసీ ఐక్య కార్యచరణ కమిటీల ఆధ్వర్యంలో బుధవారం కేఆర్‌పురం ఐటీడీఏ వద్ద ఆయా సంఘాల నాయకుల ఆధ్వర్యంలో ధర్నా చేశారు. ఈ సందర్భంగా సంఘాల నాయకులు మాట్లా డుతూ షెడ్యూల్ ప్రాంత ఉద్యోగ నియమకాల చట్టం సాధన కోసం గత వారం రోజులుగా ఆందోళనలు చేస్తున్నారని.. మా ఉద్యోగాలు మాకే ఇవ్వాలని నినాదాలు చేశారు. ఐటీడీఏ పరేడ్ గ్రౌండ్ నుంచి కార్యాలయం వరకూ భారీ ర్యాలీ చేశారు. ధర్నా అనంతరం ఐటీడిఏ ఏపీఓ పీవీఎస్ నాయుడుకు వినతిపత్రాన్ని అందజేశారు. కార్యక్రమంలో ఆదివాసీ సంక్షేమ పరిషత్ రాష్ట్ర అధ్యక్షుడు కాకి మధు, ఆదివాసీ సేన రాష్ట్ర అధ్యక్షుడు మడకం వెంకటేశ్వరరావు, ఆదివాసీ ఐక్య కార్యాచరణ కమిటీ జిల్లా చైర్మన్ మొడియం శ్రీనివాసరావు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment