స్థానిక ఉత్పత్తుల్ని ప్రోత్సహించాలి
ఆరోగ్యశ్రీ నిధులు స్వాహా..!
పాలకొల్లు ప్రభుత్వాసుపత్రిలో ఆరోగ్యశ్రీ నిధులు స్వాహా అయ్యాయి. జూనియర్ అసిస్టెంట్ సంతకాలు ఫోర్జరీ చేసి రూ.62 లక్షలు కాజేసినట్లు సమాచారం. 8లో u
ఏలూరు(మెట్రో): స్థానిక ఉత్పత్తులు, ఉత్పత్తిదారులను ప్రోత్సహించేందుకు ఓపెన్ నెట్‌వర్క్ ఫర్ డిజిటల్ కామర్స్(ఓఎన్‌డీసీ) సేవలను అందుబాటులోకి తీసుకొచ్చేందుకు ప్రత్యేక కార్యాచరణ అమలు చేయాలని కలెక్టర్ కె.వెట్రిసెల్వి సంబంధిత అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్ గోదావరి సమావేశ మందిరంలో బుధవారం కలెక్టర్ అధ్యక్షతన జిల్లా పరిశ్రమల, ఎగుమతుల ప్రోత్సాహక కమిటీ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఓఎన్‌డీసీ ప్లాట్ ఫాంలో మండలాల వారీగా ఒక ఉత్పత్తిని విక్రయాలకు ఉంచేలా వ్యవసాయ, ఉద్యాన, డీఆర్‌డీఏ, ఐటీడీఏ తదితర శాఖలు అర్హులైన వారిని గుర్తించాలన్నారు. స్వయం సహాయక సంఘాల మహిళలు ఆర్థికంగా బలోపేతం అయ్యేందుకు వారు తయారు చేసే పచ్చళ్లు, జ్యూట్ బ్యాగ్స్, ఇతర వంటకాలు ఈ విధానం ద్వారా విక్రయించేందుకు డీఆర్‌డీఏ, మెప్మా అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. ఐటీడీఎ పరిధిలో 10 రకాల గిరిజన ఉత్పత్తులను మార్కెటింగ్ చేసేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. జిల్లాలో ఉన్న 110 పరిశ్రమల్లో చైల్డ్ కేర్, ఫీడింగ్ రూంలను ప్రత్యేకంగా ఏర్పాటుచేయాలనే దిశగా ఇంతవరకు 70 పరిశ్రమలు ఏర్పాటు చేశారని, మిగిలిన వాటిని త్వరితగతిన పూర్తిచేయాలని ఆదేశించారు. సింగిల్ డెస్క్ కింద వివిధ పరిశ్రమల ఏర్పాటుకు 173 దరఖాస్తులు రాగా 166 వాటికి ఆమోదం తెలిపారన్నారు. సమావేశంలో పరిశ్రమల శాఖ జీఎం ఈ.ప్రతాప్, ఇరిగేషన్ ఎస్‌ఈ సీహెచ్ దేవప్రకాష్ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment