● తాడేపల్లిగూడెంలోని ప్రభుత్వాసుపత్రి వెనుక భాగం, అమృతపురంలో పామాయిల్ తోటల్లో ఎక్కువగా పందేలు జరుగుతున్నాయి. ఇవి కాకుండా రోజుకో ప్రాంతంలో పందేలు నిర్వహిస్తూ వాట్సప్ గ్రూపుల్లో లోకేషన్స్ షేర్ చేసి ఎంపిక చేసిన వారినే అనుమతిస్తూ దర్జాగా దందా కొనసాగిస్తున్నారు.
● ఉండి నియోజకవర్గంలో కోడి పందేల జోరు అధికంగా ఉంది. ఎన్‌ఆర్‌పీ అగ్రహారం, ఉండి శివారులోని గణపవరం రోడ్డు, మహాదేవపట్నం, పాలకోడేరు, గరగపర్రు, మోగల్లు, పాందువ్వ, కాళ్ళ మండలంలో జువ్వలపాలెం, ఏలూరుపాడు, కలవపూడి, పాతాళ్ళమెరక, ఆకివీడు మండలంలో ఐ.భీమవరం, పెద్దాపురం, దుంపగడప తదితర గ్రామాల్లో విస్తృతంగా పందేలు సాగుతున్నాయి.
● రూ. 5 లక్షల నుంచి కోట్ల వరకు పందేలు నిర్వహిస్తున్నారు. మద్యంతో సహా అన్ని ఏర్పాట్లు చేసి మరీ పందెంరాయుళ్లను ఆహ్వానిస్తున్నారు. భారీ ఫ్లడ్‌లైట్ల కాంతిలో రాత్రిపూట కూడా యథేచ్ఛగా పందేలు సాగుతున్నాయి. ఇంత జరుగుతున్నా పోలీసులు ఏ మాత్రం పట్టించుకోకపోవడం గమనార్హం.
Comments
Please login to add a commentAdd a comment