మద్యం తాగేందుకు డబ్బులు ఇవ్వలేదని..
భీమడోలు: మద్యం తాగేందుకు డబ్బులు ఇవ్వలేదని మనస్థాపానికి గురైన ఓ వ్యక్తి ఊరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. భీమడోలు పంచాయతీ పరిధిలోని అరుంధతీ కాలనీకి చెందిన నల్లభరికి లక్ష్మణ రావు(42) కూలీ పనులు చేసుకుంటూ జీవనాన్ని సాగిస్తున్నాడు. అతనికి వివాహం కాగా భార్య, ఇద్దరు సంతానం. లక్ష్మణరావు మద్యానికి బానిసయ్యాడు. అతిగా మద్యం తాగి ఇంటికి వచ్చి మరలా తాగేందుకు డబ్బులు ఇవ్వాలని భార్య జ్యోతిని అడిగాడు. ఆమె మందలించడంతో మనస్థాపానికి గురైన లక్ష్మణరావు తన ఇంటిలోని ఫ్యాన్‌కు ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఆపస్మారక స్థితిలో ఉన్న లక్ష్మణరావును భీమడోలు సామాజిక ఆరోగ్య కేంద్రానికి తీసుకుని రాగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. భీమడోలు సీఐ యూజే విల్సన్, ఎస్సై వై.సుధాకర్ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. లక్ష్మణరావు అన్నయ్య నల్లభరికి రాము ఫిర్యాదు మేరకు అనుమానాస్పద స్థితి మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై వై.సుధాకర్ తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment