ఏలూరు (ఆర్‌ఆర్‌పేట): మున్సిపల్ ఉపాధ్యాయుల పదోన్నతులకు సంబంధించి ఉపాధ్యాయ సంఘాల నాయకులతో డీఈఓ ఎం.వెంకటలక్ష్మమ్మ గురువారం తన చాంబర్‌లో సమావేశం నిర్వహించారు. శుక్రవారం జరిగే పదోన్నతుల కౌన్సెలింగ్‌కు సహకరించాలని కోరారు. తెలుగు, హిందీ ఉపాధ్యాయులు మినహా మిగిలిన వారికి పదోన్నతులు కల్పించడానికి ఏర్పాటు చేశామన్నారు. ఈ సందర్భంగా ఏపీటీఎఫ్ జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు టి.రామారావు, బి.రెడ్డిదొర మాట్లాడుతూ గతంలో ఏఏ సబ్జెక్టుకు, ఏఏ రోస్టర్, ఎవరెవరికి పదోన్నతులు కల్పించారు అనే విషయం పూర్తి సమాచారం ఇవ్వకుండా ఇప్పుడు పదోన్నతులు కల్పించాలని చూడటం సరికాదన్నారు. దీని వల్ల ఎస్సీ, ఎస్టీ, పీహెచ్ తదితర రిజర్వేషన్ అభ్యర్థులకు అన్యాయం జరిగే ప్రమాదం ఉందన్నారు. దీనిపై పూర్తి సమాచారం కోరగా మున్సిపల్ కార్యాలయాల నుంచి పూర్తి సమాచారం ఇవ్వలేదని డీఈఓ కప్పదాటు సమాధానం చెబుతున్నారని సంఘ నాయకులు ఆందోళన వ్యక్తం చేశారు. అలాగే ఇప్పటివరకు ఏలూరులో ఉర్దూ స్కూలుకు ప్రత్యేకంగా సీనియార్టీ జాబితా, రోస్టర్ లేకుండా కామన్ సీనియార్టీ మీదే పదోన్నతులు కల్పించారని, అయితే ఇప్పుడు కొత్తగా సీనియార్టీని ప్రత్యేకంగా చూపించి కొన్ని సబ్జెక్టులకు శాంక్షన్ పోస్టుల క్యాడర్‌ను తగ్గించి చూపుతున్నారని విమర్శించారు. ఈ మేరకు పూర్తి సమాచారం వచ్చిన తర్వాతే పదోన్నతులు కల్పించాలని కోరారు. పలు ఉపాధ్యాయ సంఘాల నాయకులు పాల్గొన్నారు.
డీఈఓ కప్పదాటు సమాధానంపై ఉపాధ్యాయ సంఘాల ఆందోళన
Comments
Please login to add a commentAdd a comment