అరకొర వైద్యం
భీమవరంలోని ప్రభుత్వాస్పత్రిలో అరకొర వైద్య సేవలు అందుతున్నాయి. పూర్తిస్థాయిలో వైద్య నిపుణులు లేక రోగులు ఇబ్బంది పడుతున్నారు. 8లో u
పెంపునకు ప్రతిపాదనలు
ఏలూరు(మెట్రో): ఏలూరు జిల్లా రిజిస్ట్రార్ కార్యాలయ పరిధిలోని 12 సబ్ రిజి స్ట్రార్ కార్యాలయాల్లో మార్కెట్ విలువల పెంపుదల ప్రతిపాదనలను సబ్ రిజిస్ట్రార్లు రూపొందించారని జేసీ పి.ధాత్రిరెడ్డి తెలిపారు. గురువారం కలెక్టరేట్‌లో మార్కెట్ విలువల రివిజన్ కమిటీ చైర్మన్, జాయింట్ కలక్టర్ పి.ధాత్రిరెడ్డి అధ్యక్షతన జిల్లాలోని సబ్ రిజిస్ట్రార్లతో సమావేశం నిర్వహించారు. జిల్లా రిజిస్ట్రార్ కె.శ్రీనివాసరావు, జంగారెడ్డిగూడెం, ఏలూరు, నూజీవీడు, చింతలపూడి మున్సిపల్ కమిషనర్లు, ఆర్డీ ఓలు, భూసేకరణ అధికారులు, అర్బన్ డెవలప్‌మెంట్ అధికారులు పలు అంశాలపై చర్చించా రు. మార్కెట్ విలువల పెంపు ప్రతిపాదనలను జేసీ ప్రాథమికంగా ఆమోందించారు. వివరాల ను ఐజీఆర్‌ఎస్.ఏపీ.జీఓ.ఇన్‌లో సబ్ రిజిస్ట్రార్లు నమోదు చేస్తారు. విలువలను సబ్ రిజిస్ట్రార్, జిల్లా రిజిస్ట్రార్ కార్యాలయ నోటీస్ బోర్డులో ప్రదర్శిస్తారు. వీటిపై అభ్యంతరాలు ఉంటే ఈనెల 24లోపు తెలియజేయాలని జిల్లా రిజి స్ట్రార్ కె.శ్రీనివాసరావు తెలిపారు. ఈనెల 27న కమిటీ తుది ప్రతిపాదనలను ఆమోదిస్తుందని ఆయన చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment