ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించాలి
ఏలూరు (టూటౌన్): ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవడంతో పాటు భారత రాజ్యాంగాన్ని పరిరక్షించుకోవాల్సిన ఆవశ్యకత ప్రతిఒక్కరిపై ఉందని ఆల్ ఇండియా అంబ్కేర్ యువజన సంఘం జాతీయ ప్రధాన కార్యదర్శి డాక్టర్ మెండెం సంతోష్‌కుమార్ అన్నారు. స్థానిక ఎన్‌ఆర్‌పేటలోని సంఘం రాష్ట్ర కార్యాలయంలో గురువారం విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. పార్లమెంట్‌లో కేంద్ర హోం మంత్రి అమిత్‌షా బీఆర్ అంబేడ్కర్‌ని తక్కు వ చేసి మాట్లాడటం దారుణమన్నారు. రాజ్యాంగంపై చర్చ జరపాలని ప్రతిపక్షం కోరినప్పుడు రా జ్యాంగం రాసిన అంబేడ్కర్ పేరు చెప్పకుండా వేరే వారి పేరు ఎలా చెబుతారంటూ ప్రశ్నించారు. అమిత్‌షా వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. పులవర్తి డేవిడ్, పాము మాన్ సింగ్,తెనాలి సురేష్,ిసీహెచ్ బాలకృష్ణ,నాని,నాగరాజు తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment