భీమవరం: రాష్ట్ర ప్రజల మనోభావాలను గౌ రవించి విశాఖలోని స్టీల్‌ప్లాంట్ పునరుద్ధరణకు కేంద్రం రూ.11,440 కోట్ల ఆర్థిక ప్యాకేజీ ప్రకటించిందని కేంద్ర ఉక్కు, భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాసవర్మ తెలిపారు. గురువారం భీమవరంలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ స్టీల్‌ప్లాంట్‌కు ప్రకటించిన ప్యాకేజీలో రూ.10,300 కోట్లు క్యాపిటల్ షేర్స్‌గా, రూ.1,140 కోట్లు వర్కింగ్ క్యాపిటల్‌గా కేటాయించినట్టు వివరించారు. మేనేజ్‌మెంట్‌లో లోపాలను సరిచేసుకుని నడపాలని, ప్యాకేజీలో ఉద్యోగులు, కార్మికుల జీతాల చెల్లింపునకు తొలి ప్రాధాన్యం ఉంటుందని మంత్రి స్పష్టం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment