పోలవరం రూరల్: పోలవరం ప్రాజెక్టులో ప్రధానమైన డయాఫ్రమ్ వాల్ నిర్మాణ పనులను జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు గురువారం పరిశీలించారు. యంత్రాల పనితీరు గురించి బావర్ కంపెనీ ప్రతినిధులు ఆయనకు వివరించా రు. బెంటో నైట్ మిశ్రమం ప్లాంటు, సమీపంలోని ప్రయోగశాలను సందర్శించి ప్యానెల్ తవ్వకాల్లో వస్తున్న మెటీరియల్‌ను పరిశీలించారు. అనంతరం అధికారులతో సమావేశమైన మంత్రి నిమ్మల మాట్లాడుతూ ఆర్‌అండ్‌ఆర్‌లో సిబ్బంది ఖాళీలను వెంటనే భర్తీ చేయాలన్నారు. కాంక్రీట్‌లో టి–16 మిశ్రమాన్ని వినియోగించేందుకు ఆమోదం లభించిందన్నారు. డయాఫ్రమ్‌వాల్ నిర్మాణంతో పాటు సమాంతరంగా ఈసీఆర్‌ఎఫ్ పనులు కూడా ప్రారంభించేలా ప్రణాళిక చేసినట్టు తెలిపారు. చింతూరు స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ అంబేడ్కర్ మాట్లాడుతూ నిర్వాసిత కాలనీలలో పనులు జరుగుతున్నాయన్నారు. ఏపీ ట్రైకర్ చైర్మన్ బొరగం శ్రీనివాసులు, జలవనరుల శాఖ గౌరవ సలహాదారు ఎం.వెంకటేశ్వరరావు, ప్రాజెక్ట్ సీఈ కె.నరసింహమూర్తి, ఎస్‌ఈ ఆర్.రామచంద్రరావు, ఐటీడీఏ పీఓ కె.రాముల నాయక్, ఆర్డీఓ ఎంవీ వెంకట రమణ పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment