జాబ్‌మేళాలో 17 మంది ఎంపిక | - | Sakshi
Sakshi News home page

జాబ్‌మేళాలో 17 మంది ఎంపిక

Published Fri, Jan 24 2025 12:45 AM | Last Updated on Fri, Jan 24 2025 12:44 AM

జాబ్‌

జాబ్‌మేళాలో 17 మంది ఎంపిక

ఏలూరు (టూటౌన్‌): స్థానిక జిల్లా ఉపాధి కార్యాలయంలో గురువారం నిర్వహించిన జాబ్‌మేళాలో 350 మందికి పైగా అభ్యర్థులు పాల్గొనగా 17 మందికి ఎంపికయ్యారని జిల్లా ఉపాధి కల్పనాధికారి సి.మధుభూషణరావు, నేషనల్‌ కెరీర్‌ సర్వీస్‌ జిల్లా కో–ఆర్డినేటర్‌ జి.ప్రవీణ్‌కృష్ణ తెలిపారు. చాక్లెట్‌ ప్లాంట్‌ క్యాడ్‌బరీ మోండెలేజ్‌ ఇంటర్నేషనల్‌ సంస్థలో ఉద్యోగాలకు 17 మంది ఎంపిక కాగా.. డైకిన్‌, కోల్గెట్‌ పామోలివ్‌ కంపెనీల్లో ఉద్యోగాలకు 20 మందిని షార్ట్‌లిస్ట్‌ చేశారని చెప్పారు. సెట్‌వెల్‌ సీఈఓ ప్రభాకర్‌, జిల్లా స్కిల్‌ డెవలప్‌మెంట్‌ అధికారి జితేంద్ర, ప్రభుత్వ ఐటీఐ ప్రిన్సిపాల్‌ పి.రజిత తదితరులు పాల్గొన్నారు.

ఐఎఫ్‌టీసీలో శిక్షణకు దరఖాస్తుల ఆహ్వానం

ఉంగుటూరు: బాదంపూడి మత్స్యశాఖ ఫిషరీస్‌ ట్రైనింగ్‌ సెంటరులో మూడు నెలల శిక్షణ కోసం దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్టు జిల్లా ఫిషరీస్‌ అధికారి నాగలింగాచార్యులు ప్రకటనలో తెలిపారు. వచ్చేనెల 19లోపు అభ్యర్థులు దరఖాస్తులు సమర్పించాలని సూచించారు. చేపల పెంపకంలో మెలకువలు, సాగుపై అవగాహన, వ్యాధుల నివారణ తదితర అంశాలపై శిక్షణ ఇస్తామని పేర్కొన్నారు. మార్చి 1 నుంచి మే 31 వరకు శిక్షణ ఉంటుందని, అనంతరం పరీక్ష నిర్వహించి అర్హత సాధించిన వారికి సర్టిఫికెట్లు అందిస్తామని తెలిపారు. కనీసం 5వ తరగతి విద్యార్హత ఉండాలని, చదవడం, రాయడం తెలిసిన వారికి ప్రాధాన్యమిస్తామన్నారు. శిక్షణ పూర్తిచేసుకున్న వారు ఆక్వారంగంలో ప్రభు త్వ, ప్రైవేట్‌ ఉద్యోగాలు, ఉపాధి పొందే అవకాశం ఉందని పేర్కొన్నారు.

బాలికల హక్కులను కాపాడాలి

ఏలూరు (టూటౌన్‌): బాలికల హక్కులు కాపాడటం అందరి బాధ్యత అని జాయింట్‌ కలెక్టర్‌ పి.ధాత్రిరెడ్డి అన్నారు. శుక్రవారం జాతీయ బాలికా దినోత్సవం సందర్భంగా ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ప్రో చైల్డ్‌ గ్రూప్‌, ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా ఫోరం ఫర్‌ చైల్డ్‌రైట్స్‌ ఆధ్వర్యంలో రూపొందించిన వాల్‌పోస్టర్లను ఆమె ఆవిష్కరించారు. బాలికల బంగారు భవిష్యత్తు కోసం వారి భద్రత ఆరోగ్యం విద్యపై ప్రతిఒక్కరూ బాధ్యత తీసుకోవాలని జేసీ కోరారు. ఫోరం ఫర్‌ చైల్డ్‌ రైట్స్‌ జిల్లా ప్రధాన కార్యదర్శి నేతల రమేష్‌బాబు, కోశాధికారి జాగర్లమూడి శివకృష్ణ, చైల్డ్‌ రైట్స్‌ అడ్వకసీ ఫౌండేషన్‌ (క్రాప్‌) జిల్లా కో–ఆర్డినేటర్‌ ఎస్‌.రవిబాబు న్యాయవాది చిక్కా భీమేశ్వర తదితరులు పాల్గొన్నారు.

జిల్లా ప్రధాన న్యాయమూర్తి బదిలీ

ఏలూరు (టూటౌన్‌): ఉమ్మడి పశ్చిమగోదా వరి జిల్లా ప్రధాన న్యాయమూర్తి సి.పురుషోత్తం కుమార్‌ బదిలీ అయ్యారు. ఆయన్ను మంగళగిరి లోని ఏపీ జ్యూడీషియల్‌ అకాడమీకి డైరెక్టర్‌గా నియమించారు. ఈ మేరకు హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. పురుషోత్తంకుమార్‌ స్థానంలో కొత్తగా ఎవరినీ నియమించకపోవడంతో ఏలూరు జిల్లా ఎస్సీ, ఎస్టీ కోర్టు స్పెషల్‌ జడ్జిగా పనిచేస్తున్న సునీల్‌కుమార్‌కు జిల్లా ప్రధాన న్యాయమూర్తిగా ఇన్‌చార్జి బాధ్యతలు అప్పగించారు.

1 నుంచి ప్లాస్టిక్‌ క్యారీ బ్యాగుల నిషేధం

భీమవరం (ప్రకాశంచౌక్‌): భీమవరంలో వచ్చేనెల 1 నుంచి క్యారీ బ్యాగులు, డిస్పోజబుల్‌ టీ కప్పుల నిషేధానికి కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నట్టు కలెక్టర్‌ చదలవాడ నాగరాణి తెలిపారు. గురువారం క్యాంపు కార్యాలయంలో అ ధికారులతో ఆమె సమీక్షించారు. పట్టణాన్ని ప్లాస్టిక్‌ ఫ్రీగా తీర్చిదిద్దేందుకు అడుగులు వేస్తున్నామన్నారు. తొలి అడుగుగా కలెక్టరేట్‌లో వాటర్‌ బాటిల్స్‌, డిస్పోజబుల్‌ ప్లేట్లు, టీ గ్లాసుల స్థానంలో స్టీల్‌ సామగ్రిని వినియోగిస్తున్నామన్నారు. వచ్చేనెల నుంచి పట్టణంలో ప్లాస్టిక్‌ క్యారీ బ్యాగులు, డిస్పోజబుల్‌ టీ గ్లాసులను అనుమతించబోమని హెచ్చరించారు.

No comments yet. Be the first to comment!
Add a comment
జాబ్‌మేళాలో 17 మంది ఎంపిక 1
1/2

జాబ్‌మేళాలో 17 మంది ఎంపిక

జాబ్‌మేళాలో 17 మంది ఎంపిక 2
2/2

జాబ్‌మేళాలో 17 మంది ఎంపిక

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement