రైతుకు ఎరువు దరువు | - | Sakshi
Sakshi News home page

రైతుకు ఎరువు దరువు

Published Fri, Jan 24 2025 12:44 AM | Last Updated on Fri, Jan 24 2025 12:44 AM

రైతుక

రైతుకు ఎరువు దరువు

సాక్షి, భీమవరం: ఖరీఫ్‌ కలిసిరాక.. దాళ్వా పెట్టుబడులకు సొమ్ములకు ఇప్పటికే సతమతమవుతున్న రైతులపై కాంప్లెక్‌ ఎరువుల ధరల భారం పడింది. కాంప్లెక్‌ ఎరువుల బస్తా (50 కిలోలు) ధరలు రూ.50 నుంచి రూ.230 మేర పెరగడంతో జిల్లాలో రైతులపై రూ.11.10 కోట్ల మేర అదనపు భారమవుతోంది. సాధారణంగా ఖరీఫ్‌ సీజన్‌తో పోలిస్తే రబీలో ఎరువుల వినియోగం ఎక్కువగా ఉంటుంది. ఎకరాకు నాలుగు బస్తాలు వరకు రెండు మూడు రకాల కాంప్లెక్స్‌ ఎరువులు, రెండు బస్తాల యూరియా, అర బస్తా వరకు పొటాష్‌ వినియోగిస్తుంటారు. జిల్లాలోని 2.22 లక్షల ఎకరాల్లో రైతులు రబీ సాగు చేస్తుండగా 80 శాతం మేర నాట్లు పూర్తయ్యాయి. ఈ సీజన్‌లో సుమారు 44.4 వేల టన్నుల కాంప్లెక్స్‌ ఎరువులు అవసరమవుతాయని అంచనా.

అ‘ధన’పు భారం

డీఏపీ, యూరియా ధరల్లో మార్పులు లేకపోయినా కాంప్లెక్స్‌ ఎరువుల ధరలను కంపెనీలు పెంచేశాయి. రానున్న సీజన్‌లో డీఏపీ రూ.200లకు పైగా పెరగనున్నట్టు తెలుస్తోంది. రబీలో ఎక్కువగా వినియోగించే 10:26:26 కాంప్లెక్స్‌ ఎరువు బస్తా రూ.230లు పెరగ్గా, 14:35:14 బస్తా రూ.100లు, 20:20:013 బస్తా రూ.50లు వరకు పెరిగాయి. ఎకరాకు రూ.500ల వరకు రైతులపై అదనపు భారం పడుతోంది.

భరోసానివ్వని కూటమి : వర్షాలు, వరదలు, ప్రతికూల వాతావరణం, చివరిలో దళారుల దోపిడీతో గత ఖరీఫ్‌ పంట రైతులకు కలిసిరాలేదు. చాలామంది రైతులకు పెట్టుబడులు కూడా దక్కని పరిస్థితి. మరోపక్క కూటమి ప్రభుత్వం నుంచి రైతులకు సాయం కొరవడింది. ఏడాది రూ.20 వేలు ఇస్తామంటూ సూపర్‌ సిక్స్‌లో ప్రకటించిన అన్నదాత సుఖీభవ సాయం ఇవ్వలేదు. ఖరీఫ్‌ నష్టపోయిన రైతులకు కనీసం బీమా పరిహారం అందించకపోగా ఈ రబీ నుంచి ఎకరాకు రూ.615 చొప్పున జిల్లా రైతులపై మొత్తంగా రూ.13.65 కోట్ల బీమా ప్రీమియం భారాన్ని మోపింది. పంట పెట్టుబడులకు రైతుల దగ్గర డబ్బుల్లేక దాళ్వా సాగులో తీవ్ర జాప్యమవుతోంది. ఈ తరుణంలో కాంప్లెక్స్‌ ఎరువుల ధరల పెరుగుదల గుబులు పుట్టిస్తోంది. పెరిగిన ధరలు ఇప్పటికే అమలులోకి వచ్చినట్టు ఎరువుల కంపెనీల డీలర్లు చెబుతున్నారు.

ధరల మోత.. రైతుకు వాత

కాంప్లెక్స్‌ ఎరువుల ధరలకు రెక్కలు

బస్తాకు రూ.50 నుంచి రూ.230 వరకు పెంపు

జిల్లాలో 2.22 లక్షల ఎకరాల్లో దాళ్వా వరి సాగు

రైతులపై రూ.11.10 కోట్ల మేర అదనపు భారం

ఎరువుల ధరలు (50 కిలోల బస్తా)

రకం పాత ధర కొత్త ధర

10:26:26 రూ.1,470 రూ.1,700

14:35:14 రూ.1,700 రూ.1,800

20:20:013 రూ.1,250 రూ.1,300

ప్రభుత్వం ఆదుకోవాలి

వాతావరణం కలిసి రాక ఇబ్బందులు పడుతుంటే ఈ ధరల పెంపు రైతులపై అదనపు భారం మోపుతోంది. రైతులను ఆదుకునేందుకు ప్రభుత్వం చొరవ చూపాలి. ఎరువుల ధరలను అందుబాటులో ఉంచాలి.

–వడ్లపాటి సుధాకర్‌, వద్దిపర్రు

ఎలాంటి సహకారం లేదు

ఐదేళ్లపాటు ఎంతో ఉత్సాహంగా వ్యవసాయం చేశాం. అధిక దిగుబడులు చేశాం. ఇప్పుడు ప్రభుత్వం నుంచి ఎలాంటి సహకారం లేదు. విద్యుత్‌ బిల్లులు, ఎరువుల ధరల పెంపు కుంగదీస్తోంది. వరి సాగుపై రైతులకు నిరాశ మొదలైంది.

– వెలగల జగ్గిరెడ్డి, పంపనవారిపాలెం,

No comments yet. Be the first to comment!
Add a comment
రైతుకు ఎరువు దరువు 1
1/2

రైతుకు ఎరువు దరువు

రైతుకు ఎరువు దరువు 2
2/2

రైతుకు ఎరువు దరువు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement