నేటి నుంచి హేలాపురి బాలోత్సవం
ఏలూరు (ఆర్‌ఆర్‌పేట): హేలాపురి బాలోత్సవం 5వ పిల్లల సంబరాలు శుక్రవారం నుంచి 26వ తేదీ వరకు నిర్వహించనున్నట్టు బాలోత్సవం ఆహ్వాన కమిటీ అధ్యక్షుడు ఆలపాటి నాగేశ్వరరావు తెలిపారు. గురువారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ స్థానిక సిద్ధార్థ క్వెస్ట్ విద్యాలయంలో మూడు రోజులపాటు వేడుకలు నిర్వహించనున్నామని, 69 అంశాల్లో, 4 విభాగాల్లో ప్రతిభా ప్రదర్శనలు ఉంటాయన్నారు. ప్రతి అంశంలో ఐదుగురు ప్రతిభావంతులను గుర్తించి బహుమతులు అందిస్తామన్నారు. ఉత్సవాల సందర్భంగా కాయిన్స్, ఫ్యా న్సీ కరెన్సీ నోట్ల ప్రదర్శన, మోటివేషన్ చార్ట్ ప్రదర్శనను పెదపాడు ఎంఈఓ సబ్బితి నరసింహమూర్తి, సిద్ధార్థ విద్యాసంస్థల అధినేత కోనేరు సురేష్‌బాబు ప్రారంభించారు. బాలోత్సవం వర్కింగ్ ప్రెసిడెంట్ వీజీఎంవీఆర్ కృష్ణారావు, సెక్రటరీ దేవరకొండ వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment