ప్రకృతి వ్యవసాయానికి ప్రోత్సాహం
ద్వారకాతిరుమల: మండలంలోని గుండుగొలనుకుంటలో శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర ప్రకృతి వనరుల శిక్షణా కేంద్రం ద్వారా కషాయాలు తయారు చేస్తూ, ప్రకృతి వ్యవసాయాన్ని ప్రోత్సహిస్తున్న ఒబిలిశెట్టి గోపాలకృష్ణమూర్తికి జైవిక్ ఇండియా అవార్డు లభించింది. ప్రకృతి వ్యవసాయాన్ని విస్తరించేందుకు గోపాలకృష్ణమూర్తి చేస్తున్న కృషిని ‘వ్యవసాయం కోసం అంతర్జాతీయ యోగ్యత కేంద్రం’ వారు గుర్తించారు. ఈ సందర్భంగా బుధవారం బెంగుళూరులో యోగ్యతా కేంద్రం ప్రతినిధులు గోపాలకృష్ణమూర్తికి జైవిక్ ఇండియా అవార్డు–2025ను అందజేశారు. గోపాలకృష్ణమూర్తిని గురువారం రైతులు, గ్రామస్తులు ప్రత్యేకంగా అభినందించారు.
Comments
Please login to add a commentAdd a comment