రోడ్డు ప్రమాదంలో యువకుడి దుర్మరణం
హనుమాన్ జంక్షన్ రూరల్, పెదపాడు: స్థానిక విజయవాడ రోడ్డులోని ఆర్టీసీ బస్టాండ్ వద్ద గురువారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ యువకుడు దుర్మరణం చెందాడు. ఏలూరు జిల్లా పెదపాడు మండలం పమిడికుంట గ్రామానికి చెందిన నక్కా క్రాంతికుమార్ (25), తన మిత్రుడితో కలిసి బైక్‌పై వెళ్తుండగా ప్రమాదం జరిగింది. ద్విచక్ర వాహనానికి లారీ తగలటంతో అదుపు తప్పి ఇద్దరు యువకులు రోడ్డుపై పడిపోయారు. ఈ క్రమంలో క్రాంతికుమార్ తలపై లారీ వెనుక టైర్లు ఎక్కటంతో అక్కడికక్కడే మృతి చెందాడు. అప్పటి వరకు బైక్ హుషారుగా నడిపిన క్రాంతి కుమార్ క్షణాల్లో కళ్ల ముందే విగతజీవిగా రక్తపు మడుగులో పడిపోవటంతో బైక్‌పై ఉన్న అతని స్నేహితుడి గుండెలవిసేలా రోదించాడు. ఈ ఘటనపై హనుమాన్‌జంక్షన్ పోలీసులు కేసు నమోదు చేశారు.
Comments
Please login to add a commentAdd a comment