దమ్ము ట్రాక్టర్ బోల్తా.. డ్రైవర్ మృతి
నరసాపురం రూరల్: పంట చేలో దమ్ము చేస్తుండగా ట్రాక్టర్ బోల్తా పడడంతో డ్రైవర్ మృతి చెందాడు. నరసాపురం రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని మల్లవరం గ్రామంలో ఈ ఘటన చోటుచేసుకుంది. పాలకొల్లు మండలం వెలివిలి చినపేటకు చెందిన ట్రాక్టర్ డ్రైవర్ పోతుమూడి వెంకటేశ్వరరావు (52) గురువారం మల్లవరం గ్రామంలో పంట చేలో దమ్ము చేస్తుండగా అదుపుతప్పి ట్రాక్టర్ బోల్తా కొట్టింది. ఈ ప్రమాదంలో డ్రైవర్ వెంకటేశ్వరరావు అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడికి భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు. ఎస్సై టీవీ సురేష్, సీఐ ఆధ్వర్యంలో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ఉపాధ్యాయుడిపై విచారణ
జంగారెడ్డిగూడెం: స్థానిక జెడ్పీ బాలుర హైస్కూల్‌లో డీవైఈవో రామన్న దొర గురువారం విచారణ నిర్వహించారు. ఫిజికల్స్ సైన్స్ ఉపాధ్యాయుడు మరీదు శ్రీహరిబాబు అప్పట్లో విద్యార్థినుల పట్ల అసభ్యకరంగా ప్రవర్తించాడని విద్యార్థినులు, వారి తల్లితండ్రులు ఫిర్యాదు చేశారు. దీంతో శ్రీహరిబాబును ఉన్నతాధికారులు సస్పెండ్ చేశారు. దీనిపై పోలీసులకు కూడా ఫిర్యాదు చేశారు. అయితే అప్పటి నుంచి శ్రీహరిబాబు సస్పెన్షన్‌లోనే ఉన్నారు. గురువారం ఈ ఘటనపై డీవైఈవో రామన్నదొర స్థానిక హైస్కూల్‌లో విచారణ చేపట్టారు. ఫిర్యాదుదారులను విచారించారు. నివేదికను ఉన్నతాధికారులకు నివేదిస్తామని డీవైఈవో రామన్నదొర తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment