అర్జీల పరిష్కారం సంపూర్ణంగా జరగాలి
గుంటూరు వెస్ట్: ప్రజలు అందించే అర్జీలను క్షుణ్ణంగా పరిశీలించి సంపూర్ణంగా పరిష్కరించాలని కలెక్టర్ ఎస్.నాగలక్ష్మి పేర్కొన్నారు. సోమవారం స్థానిక కలెక్టరేట్‌లో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో ఆమె మాట్లాడుతూ ఇక్కడ ప్రజలు అందించే అర్జీలు సీఎంఓ అధికారుల దృష్టిలో ఉంటాయన్నారు. ఎప్పటికప్పుడు అప్‌డేట్ రిపోర్ట్ వెళుతుందన్నారు. ఇక నుంచి అర్జీలను పరిష్కరించే క్రమంలో నిర్లక్ష్యం వహించే వారిపై కఠిన నిర్ణయాలు ఉంటాయని హెచ్చరించారు. ఆయా జిల్లా శాఖాధికారులు ఇప్పటి వరకు పెండింగ్‌లో ఉన్న అర్జీలను ప్రతివారం ఒకసారి రివ్యూ చేయాలన్నారు. ఈ సందర్భంగా కలెక్టరేట్‌లోని శంకరన్ సమావేశ మందిరం బయటకు వచ్చి దివ్యాంగుల నుంచి కలెక్టర్ అర్జీలు స్వీకరించి వారి సమస్యలను విన్నారు. అనంతరం వచ్చిన 154 ఫిర్యాదులను కలెక్టర్, జేసీ ఎ.భార్గవ్ తేజ, డీఆర్వో ఖాజావలి, ఆర్డీఓ కె.శ్రీనివాసరావు, స్పెషల్ డెప్యూటీ కలెక్టర్లు ఎం.గంగరాజు, లక్ష్మీ కుమారి, జిల్లా అధికారులు పరిశీలించారు.
కలెక్టర్ నాగలక్ష్మి గ్రీవెన్స్‌లో వినతుల స్వీకరణ
Comments
Please login to add a commentAdd a comment