నరసరావుపేట రూరల్: సైబర్ నేరాల పట్ల ప్రతి ఒక్కరు అప్రమత్తంగా ఉండాలని సైబర్ క్రైం స్పెషలిస్ట్ కె.ప్రదీప్ తెలిపారు. కాకానిలోని జేఎన్‌టీయూఎన్ ఇంజినీరింగ్ కళాశాలలో పోలీస్ శాఖ సహకారంతో బుధవారం సైబర్ క్రైంపై వర్క్‌షాప్ నిర్వహించారు. నేరాల నివారణ, సైబర్ భద్రతకు సంబంధించిన అంశాలపై ప్రదీప్ అవగాహన కల్పించారు. ప్రతి ఒక్కరు అవగాహన పెంచుకోవాలని సూచించారు. కళాశాల ప్రిన్సిపల్ ప్రొఫెసర్ శ్రీనివాసరావు మాట్లాడుతూ ఇటువంటి వర్క్‌షాప్‌లకు విద్యార్థులకు ఎంతో ఉపయోగకరంగా ఉంటాయని తెలిపారు. కార్యక్రమంలో ఏఎస్ఐ వెంకటేశ్వర్లు, కళాశాల వ్యాయామ సంచాలకులు డాక్టర్ జీపీ రాజు, అధ్యాపకులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment