కబడ్డీలో ప్రావీణ్యం పెంచుకోవాలి
చెరుకుపల్లి: కబడ్డీలో రాణించేందుకు శారీరక దారుఢ్యంతో పాటు ప్రావీణ్యాన్ని పెంచుకోవాలని రాష్ట్ర కబడ్డీ అసోసియేషన్ జాయింట్ సెక్రటరీ నాగాంజనేయులురెడ్డి, ఉమ్మడి గుంటూరు జిల్లా జాయింట్ సెక్రటరీ నెల్లిరెడ్డి తెలిపారు. ఉమ్మడి గుంటూరు జిల్లా జూనియర్ బాలుర కబడ్డీ జట్టు ఎంపికను గుళ్లపల్లి జెడ్పీ ఉన్నత పాఠశాలలో ఆదివారం నిర్వహించారు. ఉమ్మడి గుంటూరు జిల్లా నలుమూలల నుంచి 70 మంది క్రీడాకారులు పాల్గొన్నారు. వీరిలో ఉత్తమ ప్రతిభ కనపరచిన 13మందిని ఎంపిక చేశారు, ఇందులో కె.ఎస్.ఎన్. దుర్గాసాయి(బాపట్ల), ఎస్ .వీరప్పయరెడ్డి(ప్యార్లీ) కె.గోపి(బాపట్ల) డి.మనోజ్ కుమార్(రాంబొట్లపాలెం), ఎన్.ధనూష్‌రెడ్డి(పొన్నపల్లి), జె.విజయ్ శివసాయి(చెరుకుపల్లి), పి.కార్తీక్‌రెడ్డి(పొన్నపల్లి) ఎన్.మణికంఠ(చెరుకుపల్లి), జి.విజయ్ భాస్కర్‌రెడ్డి(పొన్నపల్లి) టి.మణికంఠ(చెరుకుపల్లి) ఎన్.ప్రవీణ్‌కుమార్(గుంటూరు), బి.యోగీంద్ర(గుంటూరు) జె.మోహన్‌చంద్ (చేబ్రోలు) ఎంపికయ్యారు. వీరంతా జనవరి 3,4,5 తేదీల్లో కర్నూలులో జరగనున్న అంతర్ జిల్లా కబడ్డీ పోటీల్లో పాల్గొంటారని తెలిపారు, కార్యక్రమంలో జిల్లా కబడ్డీ అసోసియేషన్ అధ్యక్ష, ఉపాధ్యక్షులు కందుల వెంకటేశ్వరరావు, అక్కల శ్రీనివాసరెడ్డి, సెలక్షన్ కమిటీ కోచ్ కూరేటి సత్యనారాయణ, క్రీడాకారులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment