బైకును ఢీకొన్న కారు.. వ్యక్తి మృతి
కొల్లిపర: కృష్ణా నది కరకట్టపై రోడ్డు ప్రమాదంలో ఒక వ్యక్తి మృతి చెందగా, ఆయన భార్యకు తీవ్ర గాయాలు అయ్యాయి. ఈ సంఘటన ఆదివారం చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాలు ప్రకారం.. బాపట్ల జిల్లా కొల్లూరు గ్రామానికి చెందిన మట్టా ఆంజనేయులు(60) బైకుపై భార్యతో కలిసి విజయవాడ నుంచి కృష్ణా నది కరకట్టపై కొల్లూరు వస్తున్నాడు. కొల్లిపర మండలంలోని పిడపర్రు లాకుల వద్ద ఎదురుగా వేగంగా వచ్చిన ఓ కారు వారిని ఢీకొంది. కరకట్ట దిగువ ఉన్న పంట పొలంలో పడి ఆంజనేయులు మృతి చెందాడు. భార్యకు తీవ్రగాయాలు కావడంతో స్థానికులు 108 ద్వారా తెనాలి ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. ఈ ప్రమాదంపై బాధిత కుటుంబసభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ పి.కోటేశ్వరరావు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment