No Headline
జనరల్ బోగీ కిటకిట
క్రిస్మస్, కొత్త సంవత్సరం పురస్కరించుకుని రైళ్లలో పండగ రద్దీ కనిపిస్తోంది. బోగీలు జనంతో కిటకిటలాడుతున్నాయి. ఆదివారం సెలవు రోజు కావటంతో లింగంపల్లి నుంచి విశాఖపట్నానికి వెళ్లే జన్మభూమి ఎక్స్‌ప్రెస్ జనరల్ బోగీ ప్రయాణికులతో కిక్కిరిసిపోయింది. నిలబడేందుకూ ఖాళీ లేకపోవటంతో ప్రయాణికులు ఇబ్బందులు పడ్డారు. పిడుగురాళ్ల రైల్వే స్టేషన్‌లో ఎక్కేందుకు ప్రయాణికులు యత్నించినా రైలులో ఖాళీ లేకపోవడంతో కొందరు మరో రైలు కోసం నిరీక్షించాల్సి వచ్చింది. క్రిస్మస్, కొత్త సంవత్సరం, సంక్రాంతి వరుసగా పండగల సీజన్ నేపథ్యంలో జనరల్ బోగీలు పెంచితే బాగుంటుందని ప్రయాణికులు కోరుతున్నారు. –పిడుగురాళ్ల
Comments
Please login to add a commentAdd a comment