కమాండ్ కంట్రోల్ ఏర్పాటుతో నేరాల నియంత్రణ
చీరాల/ కారంచేడు : కమాండ్ కంట్రోల్ ఏర్పాటు చేయడం వల్ల నేరాల్ని నియంత్రించవచ్చని సౌత్ కోస్టల్ రేంజ్ ఐజీ సర్వశ్రేష్ట త్రిపాఠి తెలిపారు. ఆయన ఆదివారం చీరాల వన్‌టౌన్, కారంచేడు పోలీస్‌స్టేషన్లను తనిఖీ చేశారు. ట్రాఫిక్ సమస్యలు, శాంతిభద్రతల పరిరక్షణ, పెండింగ్ కేసులు త్వరితగతిన ఛేదన, ప్రజలు సైబర్ నేరాల బారిన పడకుండా అప్రమత్తం చేయడంపై పోలీసు అధికారులతో చర్చించి, పలు సూచనలు చేశారు. ప్రజలందరూ సైబర్ నేరాలపై అప్రమత్తంగా ఉండాలని, డిజిటల్ అరెస్టులపై జాగ్రత్తగా ఉండాలని తెలిపారు. వాట్సప్ ద్వారా కస్టమ్స్, సీఐడీ, విజిలెన్స్ ఇతర ప్రభుత్వ శాఖల అధికారులమని బెదిరింపులు వచ్చినప్పుడు మనోధైర్యం కోల్పోకుండా స్థానిక పోలీస్‌స్టేషన్‌కు సమాచారం అందించాలని ఆయన సూచించారు. సైబర్ మోసం వల్ల డబ్బులు కోల్పోతే వెంటనే 1930 నంబర్‌కు కాల్ చేసి వివరాలు అందించాలని తెలిపారు. పోలీసు అధికారులు కూడా సైబర్ నేరాల గురించి ప్రజలలో మరింత చైతన్యం కలిగించే విధంగా చర్యలు తీసుకోవాలని సూచించారు.
సౌత్ కోస్టల్ రేంజ్ ఐజీ సర్వశ్రేష్ట త్రిపాఠి
Comments
Please login to add a commentAdd a comment