గుంటూరు
గురువారం శ్రీ 26 శ్రీ డిసెంబర్ శ్రీ 2024
7
ఆటో దహనం
వెల్దుర్తి: శిరిగిరిపాడు గ్రామ వాసి పెద్దారపు గంగాధరానికి చెందిన ఆటోను గుర్తు తెలియని వ్యక్తులు మంగళవారం అర్ధరాత్రి పెట్రోల్ పోసి దహనం చేశారు. ఆటోను ఇంటి సమీపంలోని స్థలంలో నిలిపి ఉంచగా ఈ దుశ్చర్యకు పాల్పడ్డారు.
హైకోర్టు జడ్జి పూజలు
నగరంపాలెం: గుంటూరు కొత్తపేటలోని శ్రీఆంజనేయస్వామి దేవస్థానంలో స్వామిని హైకోర్టు జడ్జి జస్టిస్ ప్రతాప వెంకట జ్యోతిర్మయి బుధవారం దర్శించుకుని, పూజలు చేశారు.
మలయప్ప అలంకరణలో శ్రీవారు
సత్తెనపల్లి: ధనుర్మాసాన్ని పురస్కరించుకొని అలివేలు మంగా పద్మావతి సమేత వేంకటేశ్వర ఆలయంలో శ్రీవారిని బుధవారం మలయప్ప స్వామిగా అలంకరించారు.
గుంటూరు జిల్లాలో క్రిస్మస్ వేడుకలు బుధవారం ఘనంగా నిర్వహించారు. పలు చర్చిల్లో మంగళవారం అర్ధరాత్రి నుంచే ఉత్సవాలు వైభవంగా కొనసాగాయి. బుధవారం ప్రత్యేక ప్రార్థనల్లో క్రైస్తవులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఏసు క్రీస్తు జననం సందర్భంగా ప్రత్యేక ప్రతిమలు ఏర్పాటు చేసి, ఆరాధించారు. ముఖ్యంగా గుంటూరు నగరంలోని ప్రముఖ చర్చిల్లో వేడుకలకు భారీగా క్రైస్తవులు తరలివచ్చారు.
క్రీస్తు జననం..
దైవ స్మరణం
– సాక్షి , నెట్‌వర్క్
న్యూస్‌రీల్
Comments
Please login to add a commentAdd a comment