పన్ను చెల్లింపుదారులు నిబంధనలు పాటించాలి
చిలకలూరిపేట: ఆదాయపు పన్ను చెల్లింపుదారులు నిబంధనలు అనుసరించి పన్నులు చెల్లించాలని ఆదాయపు పన్ను శాఖ అదనపు కమిషనర్ డాక్టర్ ఓఆర్ సుప్రియారావు చెప్పారు. పట్టణంలోని శ్రీనివాస ఫంక్షన్ హాలులో ఆదాయపు పన్ను శాఖ ఆధ్వర్యంలో మంగళవారం రాత్రి అవగాహన సదస్సు నిర్వహించారు. ఆమె మాట్లాడుతూ ఆదాయపు పన్ను చెల్లించే వారికి ఎలాంటి సందేహాలు ఉన్నా వాటిని పరిష్కరించేందుకు తమ సిబ్బంది ఎప్పుడూ అందుబాటులో ఉంటారని చెప్పారు. ఇన్‌కమ్ ట్యాక్స్ రిటర్నులు దాఖలు చేసేటప్పుడు బాధ్యతాయుతంగా వ్యవహరించాలని కోరారు. ఆదాయపు పన్ను శాఖ అధికారి జి.అరుణ్‌కుమార్ మాట్లాడుతూ కచ్చితమైన క్లెయిమ్స్‌ను మాత్రమే అందజేయాలని సూచించారు. మోసపూరిత రిఫండ్స్ వంటి అంశాలపై అవగాహన కల్పించారు. ఆడిటర్ జి.చంద్రశేఖర్ అధ్యక్షత వహించిన ఈ కార్యక్రమంలో పల్నాడు జిల్లా ట్యాక్స్ అసోసియేషన్ ఉపాధ్యక్షుడు తూబాటి మూర్తి, గబ్బిటి బాల సుబ్రమణ్యం, కటకం శివరామ్‌ప్రసాద్ పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment